Apply Now: 1497 ఉద్యోగాలు.. నేడే లాస్ట్ డేట్

SBIలో స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టుల కోసం బంపర్ రిక్రూట్‌మెంట్‌ను తాజాగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

Update: 2024-10-04 04:31 GMT

దిశ, వెబ్‌డెస్క్: SBIలో స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టుల కోసం బంపర్ రిక్రూట్‌మెంట్‌ను తాజాగా ప్రకటించిన సంగతి తెలిసిందే. బ్యాంకులో ఉద్యోగాలు చేయాలనుకునేవారికి ఇది నిజంగా గోల్డెన్ ఛాన్స్. అయితే ఈ దరఖాస్తు ప్రక్రియ నేటితో ముగియనుంది. పలు విభాగాల్లో 1,497 డిప్యూటీ మేనేజర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. బీటెక్, బీఈ, ఎంటెక్, Msc తో పాటు పని అనుభవం కలిగిన వారు అర్హులు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.750 (SC, ST, దివ్యాంగులకు మినహాయింపు). ఇతర వివరాలు, అప్లై చేసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

కాగా ఈ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా మొత్తంగా 1497 ఖాళీలను భర్తీ చేయనున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

* డిప్యూటీ మేనేజర్(సిస్టమ్స్)- ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్& డెలివరీ- 187

* డిప్యూటీ మేనేజర్(సిస్టమ్స్)- ఇన్‌ఫ్రా సపోర్ట్& క్లౌడ్ ఆపరేషన్స్- 412

* డిప్యూటీ మేనేజర్(సిస్టమ్స్)- నెట్‌వర్క్ ఆపరేషన్స్- 80

* డిప్యూటీ మేనేజర్(సిస్టమ్స్)- ఐటీ ఆర్కిటెక్ట్- 27

* డిప్యూటీ మేనేజర్(సిస్టమ్స్)- ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ- 07

* డిప్యూటీ మేనేజర్(సిస్టమ్స్)- 784


Similar News