నిరుద్యోగులకు శుభవార్త.. ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖలో 4775 ఉద్యోగాలు, త్వరపడండి
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఆరోగ్య, వైద్య-కుటుంబ సంక్షేమ శాఖ4775 jobs in Andhra Pradesh Health Department
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఆరోగ్య, వైద్య-కుటుంబ సంక్షేమ శాఖ(CFW).. కాంట్రాక్ట్ విధానంలో మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
*మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 4775
*దరఖాస్తుకు చివరి తేది: 2022 ఏప్రిల్ 16
*జోన్ల వారీగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. విశాఖపట్నం–974, రాజ మండ్రి–1446, గుంటూరు–967, కడప–1368 జోన్లలో పోస్టులు వేకన్సీ ఉన్నాయి.
*విద్యార్హతకు సంబంధించి బీఎస్సీ నర్సింగ్ పాసై ఉండాలి. అలాగే ఏపీ నర్సింగ్ కౌన్సిల్ లో రిజిస్టరై ఉండాలి.
*కమ్యూనిటీ హెల్త్ సర్టిఫికేట్ ప్రొగ్రామ్ పూర్తి చేసి ఉండాలి.
*వయోపరిమితికి సంబంధించి 35 ఏళ్ల వయస్సు మించకుండా ఉండాలి.
*బీఎస్సీలో నర్సింగ్ లో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.
*నోటిఫికేషన్ పూర్తి సమాచారం, దరఖాస్తు ప్రక్రియకు https://cfw.ap.nic.in వెబ్ సైట్ ను చూడొచ్చు.