47 ఏళ్లుగా ఒకే చోట కారు.. ఇక మాన్యుమెంట్‌గా మారనుంది!

దిశ, ఫీచర్స్ : ఒక వస్తువు కొన్ని రోజుల పాటు ఒకే స్థలంలో ఉండిపోతే ప్రతిఒక్కరికీ దానిపై కాస్త అనుమానం కలుగుతుంది. వారి మనసుల్లో అనేక ప్రశ్నలు మెదులుతాయి. ఆ వస్తువు ఎవరిది? ఎందుకు మూలనపడేశారు? ఇన్ని రోజుల పాటు తీయకపోవడానికి కారణమేంటి? ఎక్కడైనా దొంగలించిందా? లేదా అందులో బాంబ్ ఉందా? ఇది ఉగ్రవాదుల కుట్రలో భాగమా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు మెదులుతాయి. చివరకు పోలీస్ కంప్లయింట్ దాకా వెళ్తుంది. అయితే ఇటలీలో మాత్రం ఓ కారు […]

Update: 2021-11-02 05:32 GMT

దిశ, ఫీచర్స్ : ఒక వస్తువు కొన్ని రోజుల పాటు ఒకే స్థలంలో ఉండిపోతే ప్రతిఒక్కరికీ దానిపై కాస్త అనుమానం కలుగుతుంది. వారి మనసుల్లో అనేక ప్రశ్నలు మెదులుతాయి. ఆ వస్తువు ఎవరిది? ఎందుకు మూలనపడేశారు? ఇన్ని రోజుల పాటు తీయకపోవడానికి కారణమేంటి? ఎక్కడైనా దొంగలించిందా? లేదా అందులో బాంబ్ ఉందా? ఇది ఉగ్రవాదుల కుట్రలో భాగమా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు మెదులుతాయి. చివరకు పోలీస్ కంప్లయింట్ దాకా వెళ్తుంది. అయితే ఇటలీలో మాత్రం ఓ కారు 47 ఏళ్లుగా ఇటాలియన్ వీధిలో పార్క్ చేసిన ప్రదేశంలోనే ఉంటోంది. ఆ మిస్టీరియస్ కారు ఓ పర్యాటక ఆకర్షణగా మారింది. తాజాగా దానికోసం ఓ మాన్యుమెంట్‌ను సైతం నిర్మించనున్నారు.

19వ శతాబ్దంలో ఇటలీ కొనెగ్లియానో పట్టణంలోని ఓ వీధిలో ‘న్యూస్‌స్టాండ్‌’ అనే పత్రికా కార్యాలయం ఉండేది. ఇటలీకి చెందిన ఏంజెలో ఫ్రెగోలెంట్, తన భార్య బెర్టిల్లా మొడోలోతో దాన్ని నిర్వహించేవారు. అయితే 1962లో ఒకానొక రోజున కార్యాలయం బయట తన లాన్సియా ఫుల్వియా కారును పార్క్ చేశారు. ఆ తర్వాత పదవీ విరమణ చేసిన జంట.. కారును అక్కడే వదిలేయడం జరిగింది. దాంతో ఆ కారు ఇప్పటికీ అక్కడే ఉంది. అయితే కాలక్రమేనా అదొక ల్యాండ్‌మార్క్‌గా మారిపోయింది. ఆ తర్వాత దాని చుట్టూ చేరిన పర్యాటకులు, స్థానికులు సెల్ఫీలు తీసుకుని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో ఆ ఫొటోలు వైరల్ అయ్యాయి. కాగా దాదాపు ఐదు దశాబ్దాల తర్వాత ఈ కారును తరలించాలని నిర్ణయించుకున్న పట్టణ అధికారులు.. దాన్ని పునరుద్ధరించి స్మారక చిహ్నంగా మార్చబోతున్నారు.

పాడువాలో ఉన్న ‘ఆటో ఈ మోటో డీఎపొకా(Auto e Moto d’Epoca)’ మోటార్‌ షోకి ఈ కారును షిష్ట్ చేయగా.. ఇతర టైమ్‌లెస్ క్లాసిక్ కార్లతో పాటు దీన్ని కూడా ప్రదర్శనలో ఉంచారు. పూర్తిగా దాన్ని రిపేర్ చేసిన తర్వాత ఏంజెలో, బెర్టిల్లా ఇంటి పక్కనే మళ్లీ మాన్యుమెంట్‌గా నిలపనున్నారు. లాన్సియా ఫుల్వియాను పియరో కాస్టాగ్నేరో రూపొందించగా 1972 ఇంటర్నేషనల్ ర్యాలీ చాంపియన్‌షిప్‌లో విజయవంతంగా పోటీ పడిన తర్వాత మోటార్‌స్పోర్ట్ ప్రపంచంలో ప్రసిద్ధి చెందింది.

Tags:    

Similar News