బ్యాటింగ్‌లో పూర్తిగా విఫలమయ్యాం : రోహిత్ శర్మ

దిశ, వెబ్‌డెస్క్: చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ ఘన విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై మొదటి నుంచి పేలవ ప్రదర్శన కనబరిచింది. ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ మినహ అందరూ పంజాబ్ బౌలింగ్‌కు చతికిలబడ్డారు. ఈ మ్యాచ్‌లో ముంబైపై పంజాబ్ 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. అయితే.. ముంబై ఓటమిపై కెప్టెన్ […]

Update: 2021-04-24 00:14 GMT

దిశ, వెబ్‌డెస్క్: చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ ఘన విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై మొదటి నుంచి పేలవ ప్రదర్శన కనబరిచింది. ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ మినహ అందరూ పంజాబ్ బౌలింగ్‌కు చతికిలబడ్డారు. ఈ మ్యాచ్‌లో ముంబైపై పంజాబ్ 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. అయితే.. ముంబై ఓటమిపై కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘‘గత రెండు మ్యాచ్‌ల్లో మేము బ్యాటింగ్‌లో పూర్తిగా విఫలమయ్యాం. ఇదేమీ బ్యాడ్‌ వికెట్‌ కాదు. పంజాబ్‌ కింగ్స్‌ ఎంత ఈజీగా బ్యాటింగ్‌ చేసిందో మీరు చూశారుగా. మా బ్యాటింగ్‌లోనే ఏదో మిస్ అయింది. మేం 150 పరుగులు చేసి ఉంటే అవకాశం ఉండేది. ఏదేమైనా మా బ్యాటింగ్ గురించి నిజాయితీగా పరిశీలించుకోవాల్సి ఉంది’’ అని రోహిత్ శర్మ అభిప్రాయపడ్డారు.

Tags:    

Similar News