విప్రో సీఈవోగా క్యాప్‌జెమినీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్!

దిశ, సెంట్రల్ డెస్క్: దేశంలోని మూడో అతిపెద్ద ఐటీ కంపెనీ విప్రో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో), మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ)గా మరో దిగ్గజ సంస్థ క్యాప్‌జెమినీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ థియెరీ డెలాపొర్టేను నియమిస్తున్నట్టు విప్రో ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న సీఈవో అబిదాలి నీముచ్‌వాలా జూన్ 1న సీఈవో, ఎండీ పదవి నుంచి వైదొలగనున్నారు. రిషద్ ప్రెమ్‌జీ జూలై 5 వరకు కంపెనీ రోజువారీ కార్యకలాపాలను పర్యవేక్షిస్తారు. డెలపోర్టె జూలై 6న విప్రోలో బాధ్యతలు స్వీకరిస్తారు. ‘డెలాపోర్టె […]

Update: 2020-05-28 23:45 GMT

దిశ, సెంట్రల్ డెస్క్: దేశంలోని మూడో అతిపెద్ద ఐటీ కంపెనీ విప్రో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో), మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ)గా మరో దిగ్గజ సంస్థ క్యాప్‌జెమినీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ థియెరీ డెలాపొర్టేను నియమిస్తున్నట్టు విప్రో ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న సీఈవో అబిదాలి నీముచ్‌వాలా జూన్ 1న సీఈవో, ఎండీ పదవి నుంచి వైదొలగనున్నారు. రిషద్ ప్రెమ్‌జీ జూలై 5 వరకు కంపెనీ రోజువారీ కార్యకలాపాలను పర్యవేక్షిస్తారు. డెలపోర్టె జూలై 6న విప్రోలో బాధ్యతలు స్వీకరిస్తారు. ‘డెలాపోర్టె కంపెనీ సీఈవో, ఎండీగా వస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఆయన అసాధారనమైన నాయకత్వం లక్షణాలను, అంతర్జాతీయంగా ఉన్న బలమైన సంబంధాలు, వ్యూహాత్మక నైపుణ్యం, దీర్ఘకాలం పాటు వినియోగదారులతో సంబంధాలను కలిగివుండే సామర్థ్యం ఇంకా పలు విభిన్న లక్షణాలు విప్రో సంస్థను మరింత వృద్ధిలోకి తీసుకెళ్తాయని భావిస్తున్నాం’ అని విప్రో ఛైర్మన్ రిషద్ ప్రెమ్‌జీ చెప్పారు. థియెరీ డెలాపోర్టె క్యాప్‌జెమినీ గ్రూప్ సీఈవో, గ్రూప్ ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యుడిగా ఉన్నారు. 25 ఏళ్ల వృత్తి జీవితంలో అనేక బాధ్యతలను నిర్వర్తించారు. క్యాప్‌జెమినీ ఇండియా కార్యకలాపాలను పర్యవేక్షిస్తూ, సంస్థ ఎజెండాను ముందుకు తీసుకెళ్లారు. పలు వ్యాపార విభాగాలలో వ్యూహాత్మక కార్యక్రమాలను నిర్వహించారు. ‘విప్రో వంటి విలువలు బలమైన పునాది కలిగిన సంస్థకు బాధ్యతలు తీసుకోవడం గౌరవంగా భావిస్తున్నాను’ అని డెలాపోర్టె రిషద్ ప్రెమ్‌జీకి పంపిన లేఖలో పేర్కొన్నారు.

డెలాపోర్టె సైన్సెస్ పో పారిస్ నుంచి ఎకానమీ, ఫైనాన్స్‌లో డిగ్రీ పట్టా పొందారు. సోర్బనె యూనివర్శిటీ నుంచి మాస్టర్స్ ఇన్ లా అభ్యషించారు. ఆయన లాభాపేక్షలేని ఆర్గనైజేషన్ లైఫ్ ప్రాజెక్ట్ ఫర్ యూత్ అనే సంస్థ సహ వ్యవస్థాపకుడు, అధ్యక్షుడిగా ఉన్నారు.

Tags:    

Similar News