‘1984’ను పునరావ‌ృతం కానివ్వబోం : హైకోర్టు

న్యూఢిల్లీ : దేశంలో 1984 అల్లర్లలాంటి ఘటనలు పునరావృతం కానివ్వబోమని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఢిల్లీ హింసాత్మక ఘర్షణలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై మండిపడింది. నాలుగు రోజులుగా ఢిల్లీలో చోటుచేసుకుంటున్న హింసను అదుపులోకి తీసుకొచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలని సూచించింది. ఢిల్లీలోని మౌజ్‌పూర్‌లో సీఏఏ అనుకూలురులను వ్యతిరేకులపైకి ఉసిగొల్పుతూ బీజేపీ నేత కపిల్ మిశ్రా చేసిన వ్యాఖ్యలు విన్న తర్వాత న్యాయమూర్తి జస్టిస్ ఎస్ మురళీధర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో మరోసారి 1984 […]

Update: 2020-02-26 06:31 GMT

న్యూఢిల్లీ : దేశంలో 1984 అల్లర్లలాంటి ఘటనలు పునరావృతం కానివ్వబోమని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఢిల్లీ హింసాత్మక ఘర్షణలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై మండిపడింది. నాలుగు రోజులుగా ఢిల్లీలో చోటుచేసుకుంటున్న హింసను అదుపులోకి తీసుకొచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలని సూచించింది. ఢిల్లీలోని మౌజ్‌పూర్‌లో సీఏఏ అనుకూలురులను వ్యతిరేకులపైకి ఉసిగొల్పుతూ బీజేపీ నేత కపిల్ మిశ్రా చేసిన వ్యాఖ్యలు విన్న తర్వాత న్యాయమూర్తి జస్టిస్ ఎస్ మురళీధర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో మరోసారి 1984 అల్లర్లను జరగబోనివ్వమని అన్నారు. 1984 సిక్కులకు వ్యతిరేకంగా జరిగిన అల్లర్లలో కేవలం ఢిల్లీలోనే సుమారు 3000 మంది మరణించిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News