ఆ ఆస్పత్రుల్లో కొవిడ్ చికిత్సల అనుమతులు రద్దు

దిశ, తెలంగాణ బ్యూరో: కొవిడ్ చికిత్సలందిస్తున్న మరో ఆరు ఆసుపత్రుల అనుమతులను రద్దు చేస్తూ ప్రజారోగ్య శాఖ ఉత్తర్వులను జారీ చేసింది. మంగళవారం ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. కొవిడ్ చికిత్సల అనుమతులు రద్దు చేసిన ఆసుపత్రుల్లో సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రి, గచ్చిబోలిలోని సన్‌సైన్ ఆసుపత్రి, బంజారాహిల్స్‌లోని సెంచురీ ఆసుపత్రి, లక్డీకపూల్‌లోని లోటస్ ఆసుపత్రి, ఎల్‌బీ నగర్ లోని మెడిసిస్ ఆసుపత్రి, టోలిచౌకిలోని ఇంటర్ గో ఆసుపత్రులు ఉన్నాయని […]

Update: 2021-06-01 09:50 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కొవిడ్ చికిత్సలందిస్తున్న మరో ఆరు ఆసుపత్రుల అనుమతులను రద్దు చేస్తూ ప్రజారోగ్య శాఖ ఉత్తర్వులను జారీ చేసింది. మంగళవారం ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. కొవిడ్ చికిత్సల అనుమతులు రద్దు చేసిన ఆసుపత్రుల్లో సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రి, గచ్చిబోలిలోని సన్‌సైన్ ఆసుపత్రి, బంజారాహిల్స్‌లోని సెంచురీ ఆసుపత్రి, లక్డీకపూల్‌లోని లోటస్ ఆసుపత్రి, ఎల్‌బీ నగర్ లోని మెడిసిస్ ఆసుపత్రి, టోలిచౌకిలోని ఇంటర్ గో ఆసుపత్రులు ఉన్నాయని తెలిపారు.

ప్రస్తుతం ఈ ఆసుపత్రుల్లో ఉన్న కొవిడ్ పేషెంట్లకు మాత్రమే చికిత్సలందించాలని, కొత్తగా కొవిడ్ పేషెంట్లకు అడ్మిషన్లు ఇవ్వకూడదని ఆదేశాలు జారీ చేశామన్నారు. ప్రభుత్వం చేపట్టిన చర్యలతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 22 ఆసుపత్రుల్లో కొవిడ్ చికిత్సల అనుమతులను రద్దు చేశామని వివరించారు. మంగళవారం కొత్తగా 8 ఆసుపత్రులపై 8 ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు. మొత్తం 166 ఆసుపత్రులపై 174 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. వీటిలో ఇప్పటి వరకు 113 ఆసుపత్రులకు అధిక బిల్లులు వసూలుపై, అనవసర చికిత్సలపై వివరణలు ఇవ్వాల్సిందిగా షోకాజ్ నోటీసులు జారీ చేశామన్నారు.

Tags:    

Similar News