రుతుస్రావం సమయంలో అలా చేయవచ్చా..?

దిశ, వెబ్‌డెస్క్ : టీనేజ్ రాగానే యువతీయువకుల్లో శారీరక మార్పులు రావడం సహజం. కౌమర దశలోకి రాగానే అబ్బాయిలకు మీసాలు, గడ్డాలు వస్తుంటాయి. చాతీ పెరగడంతోపాటు రుతుచక్రం ప్రారంభం అవుతుంది. టీనేజ్ దశ నుంచి మోనోపాజ్ ( 30 నుంచి 40 సంవత్సరాలు) దశ వరకు ఈ రుతుక్రమం కొనసాగుతుంది. అయితే రుతుక్రమం సమయంలో అమ్మాయిలకు కడుపులో నొప్పితోపాటు కాళ్లు గుంజడం, నీరసంగా ఉండడం, తల నొప్పి, మరికొందరికి జ్వరం కూడా వస్తుంది. ఈ బాధలను భరించలేక […]

Update: 2021-01-31 12:24 GMT

దిశ, వెబ్‌డెస్క్ : టీనేజ్ రాగానే యువతీయువకుల్లో శారీరక మార్పులు రావడం సహజం. కౌమర దశలోకి రాగానే అబ్బాయిలకు మీసాలు, గడ్డాలు వస్తుంటాయి. చాతీ పెరగడంతోపాటు రుతుచక్రం ప్రారంభం అవుతుంది. టీనేజ్ దశ నుంచి మోనోపాజ్ ( 30 నుంచి 40 సంవత్సరాలు) దశ వరకు ఈ రుతుక్రమం కొనసాగుతుంది. అయితే రుతుక్రమం సమయంలో అమ్మాయిలకు కడుపులో నొప్పితోపాటు కాళ్లు గుంజడం, నీరసంగా ఉండడం, తల నొప్పి, మరికొందరికి జ్వరం కూడా వస్తుంది. ఈ బాధలను భరించలేక కాలేజీలకు, ఆఫీస్‌లకు సెలవులు పెడుతుంటారు. అయితే కొన్ని జాగ్రత్తలు, వ్యాయమం చేస్తే పై సమస్యలన్నీ అధిగమించవచ్చని వైద్యులు పేర్కొంటున్నారు.

పీరియడ్స్ టైంలో హార్మోన్ల మార్పులు జరిగే సంక్లిష్టమైన సమయం. రుతు చక్రం కాలం మొత్తం ప్రొజెస్టెరాన్, ఈస్ట్రోజెన్ రెండూ చాలా తక్కువగా ఉంటాయి. దీని వల్ల స్త్రీలల్లో అలసటతోపాటు శక్తిని కోల్పోయి నీరసం కలిగిస్తుంది. పిరియడ్స్ సమయంలో ఇంట్లోనే ఉండి కొన్ని వ్యాయమాలు చేస్తే కొత్త శక్తి రావడంతో పాటు రోజంతా ఉల్లాసంగా ఉండవచ్చు. దీనికి ఏం చేయాలో తెలుసుకుందాం..

ఉదయం సమయంలో వాకింగ్ చేస్తే మొక్కలు, చెట్ల మీదుగా వచ్చే స్వచ్ఛమైన ఆక్సీజన్ అందుతుంది. ఉదయం సాయంత్రం వాకింగ్ చేస్తే ఏ జబ్బు మీ దరి చేరదు. దాంతోపాటు వ్యాయమం చేస్తే మెదడు చురుకుదనంగా మారుతోంది. శరీరంలోని రక్త నాళాలను ఆరోగ్యంగా ఉంచి రక్త ప్రసరణ సజావుగా జరుగుతుంది. దీని వల్ల రక్తపోటుకు చెక్ పెట్టవచ్చు. శరీకంలో ఉండే మంచి కొవ్వు హెచ్డీఎస్‌కు, చెడు కొలెస్ట్రాల్ ఎల్డీఎల్ఐని తొలగించే శక్తి ఉంది. వ్యాయమం వల్ల చెడు కొవ్వు తగ్గి బరువు తగ్గవచ్చు. ఎముకలు సైతం బలిష్టంగా తయారు అవుతాయి. నిత్ర లేనికి చెక్ పెట్టి ప్రశాంతంగా గాఢనిద్రలోకి జారుకోవచ్చు. వీటి వల్ల శరీరం యాక్టివ్ గా ఉండడంతోపాటు రుతుక్రమం సమయంలో ఎదురయ్యే సమస్యలను దూరం చేస్తుంది. అయితే ఈ వ్యాయమం సొంతంగా కాకుండా వ్యాయమ శిక్షకుల సమక్షంలో చేయాలని వైద్యులు సూచిస్తున్నారు.

Tags:    

Similar News