కరోనా కరెన్సీని మాయం చేస్తుందా!?

దిశ, వెబ్‌డెస్క్: భూమి మీద నివశించే మొత్తం మానవాళిని భయపెడుతున్న మహమ్మారి కరోనా..మనిషి ఐకమత్యానికి ప్రతీక అనే మాటను తలకిందులు చేస్తూ మనిషిని మనిషి తాకితే ప్రమాదం అనే కొత్త చరిత్రను రాస్తోంది. అయితే, మనిషి ఆర్థికంగా ఎదగడానికి కరెన్సీని మారకంగా ఉపయోగిస్తున్నాడు. ఇప్పుడు, కరోనా విసురుతున్న వైరస్ మంటలకు మనిషి వాడుతున్న కరెన్సీ మనుగడ లేకుండా పోతుందా? అనే కొత్త ప్రశ్న విశ్లేషకుల్లో మొదలైంది. కరోనా మహమ్మారి దెబ్బకు ప్రపంచంపై నగదు చేసే అజమాయిషీ ఇక […]

Update: 2020-03-22 05:43 GMT

దిశ, వెబ్‌డెస్క్: భూమి మీద నివశించే మొత్తం మానవాళిని భయపెడుతున్న మహమ్మారి కరోనా..మనిషి ఐకమత్యానికి ప్రతీక అనే మాటను తలకిందులు చేస్తూ మనిషిని మనిషి తాకితే ప్రమాదం అనే కొత్త చరిత్రను రాస్తోంది. అయితే, మనిషి ఆర్థికంగా ఎదగడానికి కరెన్సీని మారకంగా ఉపయోగిస్తున్నాడు. ఇప్పుడు, కరోనా విసురుతున్న వైరస్ మంటలకు మనిషి వాడుతున్న కరెన్సీ మనుగడ లేకుండా పోతుందా? అనే కొత్త ప్రశ్న విశ్లేషకుల్లో మొదలైంది. కరోనా మహమ్మారి దెబ్బకు ప్రపంచంపై నగదు చేసే అజమాయిషీ ఇక ఉండదా? ప్రపంచం మొత్తాన్ని నడిపించే నగదు కరోనా సోకి మరణిస్తుందా? కరెన్సీకి ఉన్న బలహీనతలేంటో ఒకసారి పరిశీలిద్దాం..!

వైరస్ బదిలీ అయ్యే ప్రమాదం:

కరోనా విస్తరిస్తున్న వేగానికి అంతర్జాతీయంగా వ్యాపారులు నోట్ల వాడకాన్ని ఆపేశారు. భౌతికమైన కరెన్సీని వాడటం వల్ల వైరస్ ఒకరి నుంచి మరొకరికి చేరే అవకాశముందనే అనుమానాలతో చాలామంది ఇప్పటికే నోట్లను తీసుకోవడాన్ని తగ్గించారు. దీనికి సంబంధించి ప్రభుత్వ అధికారులు, వైద్య నిపుణులు కూడా సూచనలు జారీ చేస్తున్నారు. వ్యాపారులు, పౌరులు నోట్ల వాడకాన్ని వీలైనంత తక్కువగా ఉపయోగించాలని, డిజిటల్ పేమెంట్స్ చాలా వరకూ అందుబాటులో ఉన్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని విజ్ఞప్తి చేస్తున్నారు.


నగదును అంగీకరించడం లేదు:

ఇప్పటికే చాలా దేశాల్లో నోట్లను తీసుకోవడం తగ్గించారు. అమెరికాలోని చికాగో లాంటి నగరాల్లోనూ స్టోర్ యజమానులు వినియోగదారులకు నగదు వద్దని, డిజిటల్ పేమెంట్స్‌తో సహకరించమని ఈ-మెయిల్ ద్వారా అభ్యర్థిస్తున్నారు. వాషింగ్టన్‌లోనూ చాలా చోట్ల నగదును స్వీకరించడం మానేశారు. ఇక, ముఖ్యంగా ఆన్‌లైన్ డెలివరీల విషయంలో నగదునే ఎక్కువమంది ఇస్తుంటారు. వాటివల్ల కూడా ప్రమాదం లేకపోలేదు. అలాంటి డెలివరీ సేవల్లో కూడా నగదును ఇవ్వడం, తీసుకోవడం తగ్గించారు.

ఇతర ప్రసార మార్గాలు:

నిపుణుల అభిప్రాయం ప్రకారం..ఇప్పటి వరకూ నగదు ద్వారా ఎవరికీ కరోనా వైరస్ సోకలేదు. అలాగని ప్రమాదం లేదని కాదు, ఇతర మార్గాలతో పోల్చుకుంటే నగదు ద్వారా వైరస్ పాకే ప్రమాదం తక్కువగా ఉంటుంది. సాధారణంగా ఏ వైరస్ అయినా గాలిలో 3 గంటలు, కార్డు, అట్టముక్కలు వంటి వాటిపై 24 గంటలు జీవించగలదు. ప్లాస్టిక్, స్టీల్ వంటి వస్తువుల మీద రెండు నుంచి మూడు రోజులు జీవించగలదు. అయితే, నోటు కాగితంపై జీవించగలదా లేదా అనేది పరిశోధకులు ఇంకా తేల్చలేదు. నోట్లపై వైరస్ కణాలు ఉండటం వల్ల ఆరోగ్యానికి హానీ అని కాదు, వైరస్ కణాలు ఉపరితలంపై తిరిగొచ్చే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు.


చెల్లింపుల కోసం ఇతర పరికరాలు:

ఏవైనా వస్తువులు కొన్నప్పుడు చెల్లించేందుకు ఉపయోగించే నోట్ల వంటివి వ్యాధిని బదిలీ చేసే వాహకంగా మారే అవకాశముంది. క్రెడిట్, డెబిట్ కార్డులు ఎక్కువగా ప్లాస్టిక్, లోహాలతో తయారు చేయబడతాయి. ఏటీఎంలు రోజూ అనేకచోట్ల చాలామంది చేతులు మారతాయి. అంతేకాకుండా స్మార్ట్‌ఫోన్ ప్రతి ఒక్కరి చేతిలో ఎక్కువ సమయం ఉండటం వల్ల బ్యాక్టీరియాతో ఆయా వస్తువులన్నీ కలుషితమవుతున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

ముందు జాగ్రత్త చర్య:

ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ కూడా నగదు సరఫరా వల్ల కలుషితం అవ్వకుండా ప్రయత్నాలు చేస్తోంది. యూరప్, ఆసియాలో చెలామణిలో ఉన్న నోట్లను వారం నుంచి పది రోజుల వరకూ ముందు జాగ్రత్త చర్యగా నిర్భంధిస్తున్నట్లు ఫెడరల్ రిజర్వ్ ప్రతినిధి ఒకరు తెలిపారు. వ్యాపారులు నగదు వినియోగాన్ని వీలైనంత మేరకు తగ్గిస్తుండగా, దేశంలోని చాలా ప్రాంతాల్లో ఏటీఎంల నుంచి ప్రజలు పెద్ద మొత్తంలో నగదు ఉపసంహరణలు చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కొన్ని బ్యాంకులు ఫెడ్ నుంచి అదనంగా నగదును ఆర్డర్ చేయవల్సి వచ్చింది.

వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి అమెరికా మాత్రమే కాకుండా దక్షిణ కొరియా కూడా మరింత అప్రమత్తంగా ఉంది. ఈ విషయంలో దక్షిణ కొరియా విజయవంతమైంది కూడా. ఆ దేశ సెంట్రల్ బ్యాంక్ రెండు వారాల పాటు అన్ని నోట్ల చెలామణిని ఆపేసింది. కొన్ని కేసుల్లో నోట్లను కాల్చి వేసిన సంఘటనలు కూడా ఉన్నాయి.

ఇటువంటి పరిస్థితుల్లో కరోనాను అరికట్టేందుకు భౌతిక వస్తువుల పట్ల జాగ్రత్తలు తప్పనిసరి. రానున్న కాలంలో కరోనా వైరస్ లేదంటే మరో వైరస్ ప్రజా జీవితంపై పడితే నోట్ల వాడకాన్ని పూర్తీగా నిరోధించే అవకాశాలున్నాయి. పెరుగుతున్న టెక్నాలజీ ప్రపంచంలో నగదు వంటి భౌతిక కరెన్సీ బదులుగా డిజిటల్ పేమెంట్స్‌ని మాత్రమే ఉపయోగించేలా అన్ని దేశాలు నిర్ణయాలు తీసుకోవచ్చు. ఇప్పటికైతే అమెరికా, దక్షిణ కొరియా దేశాలు కరోనాపై పోరాటంగా నోట్లను తగ్గించాయి కానీ పరిశోధనల్లో నోట్ల వల్ల కూడా వైరస్ పాకే ప్రమాదముందని తేలితే పరిస్థితులు ఎలా ఉంటాయో ఊహించుకోగలమా!?

Tags: Cash, people avoiding notes, coronavirus, corona effect

Tags:    

Similar News