పోలింగ్‌కు 72 గంటల ముందే ప్రచారం బంద్..​

దిశ, మెదక్ : ఈ నెల 10న జరుగనున్న మెదక్ స్థానిక సంస్థల నియోజకవర్గ శాసనమండలి ఎన్నికల పోలింగ్ సందర్భంగా 72 గంటల ముందే అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారం నిలుపుదల చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హరీష్ తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గతంలో పోలింగుకు 48 గంటల ముందు ప్రచారం నిలుపుదల చేయవలసి ఉండగా.. ఇటీవల ఏప్రిల్‌లో జరిగిన వెస్ట్ బెంగాల్ ఎన్నికలలో ప్రచార […]

Update: 2021-12-07 03:54 GMT

దిశ, మెదక్ : ఈ నెల 10న జరుగనున్న మెదక్ స్థానిక సంస్థల నియోజకవర్గ శాసనమండలి ఎన్నికల పోలింగ్ సందర్భంగా 72 గంటల ముందే అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారం నిలుపుదల చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హరీష్ తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గతంలో పోలింగుకు 48 గంటల ముందు ప్రచారం నిలుపుదల చేయవలసి ఉండగా.. ఇటీవల ఏప్రిల్‌లో జరిగిన వెస్ట్ బెంగాల్ ఎన్నికలలో ప్రచార కార్యక్రమాన్ని 72 గంటల ముందే ముగించాలని భారత ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసిందని ఆయన తెలిపారు.

అవే నిబంధనలు ఈ శాసన మండలి ఎన్నికలకు కూడా వర్తిస్తాయని ఎన్నికల కమిషన్ పేర్కొందని తెలిపారు. కాబట్టి పోటీ చేస్తున్న అభ్యర్థులు పోలింగుకు 72 గంటల ముందు నుంచే ఎటువంటి ఎన్నికల ప్రచార కార్యక్రమాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. నిబంధనలను అతిక్రమిస్తే బాధ్యులపై కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

 

Tags:    

Similar News