వీర్యం కోసం కోర్ట్ మెట్లెక్కిన మామ – కోడలు
దిశ,వెబ్‌డెస్క్: భర్త వీర్యం కట్టుకున్న భార్యకే చెందుతుందంటూ కోర్ట్ తీర్పించ్చింది. కోర్ట్ తీర్పుతో కొడుకు వీర్యం కోసం కోర్టు మెట్లెక్కిన తండ్రి నిరాశగా వెనుదిరిగాడు. కోల్‌కత్తాకు చెందిన ఓ వ్యక్తి తలసేమియాతో బాధపడుతున్నాడు. అయితే భవిష్యత్ అవసరాల దృష్ట్యా బాధితుడి వీర్యాన్ని సేకరించి ఢిల్లీకి చెందిన ఓ ఆస్పత్రిలో భద్రపరిచారు. కొద్దిరోజులకే బాధితుడు మరణించడంతో, భద్రపరిచిన వీర్యాన్ని సొంతం చేసుకునేందుకు తండ్రి ఆస్పత్రి యాజమాన్యంతో సంప్రదింపులు జరిపాడు. అందుకు కొడుకు వీర్యాన్ని తండ్రికి ఇచ్చేందుకు ఒప్పుకోలేదు. వీర్యం […]
దిశ,వెబ్‌డెస్క్: భర్త వీర్యం కట్టుకున్న భార్యకే చెందుతుందంటూ కోర్ట్ తీర్పించ్చింది. కోర్ట్ తీర్పుతో కొడుకు వీర్యం కోసం కోర్టు మెట్లెక్కిన తండ్రి నిరాశగా వెనుదిరిగాడు. కోల్‌కత్తాకు చెందిన ఓ వ్యక్తి తలసేమియాతో బాధపడుతున్నాడు. అయితే భవిష్యత్ అవసరాల దృష్ట్యా బాధితుడి వీర్యాన్ని సేకరించి ఢిల్లీకి చెందిన ఓ ఆస్పత్రిలో భద్రపరిచారు. కొద్దిరోజులకే బాధితుడు మరణించడంతో, భద్రపరిచిన వీర్యాన్ని సొంతం చేసుకునేందుకు తండ్రి ఆస్పత్రి యాజమాన్యంతో సంప్రదింపులు జరిపాడు. అందుకు కొడుకు వీర్యాన్ని తండ్రికి ఇచ్చేందుకు ఒప్పుకోలేదు. వీర్యం కావాలంటే తప్పనిసరిగా కోడలు అనుమతి కావాల్సిందేనని స్పష్టం చేసింది. దీంతో కొడుకు వీర్యంపై తనకే హక్కుదంటూ తండ్రి కోల్ కత్తా హైకోర్ట్ ను ఆశ్రయించాడు. విచారణ చేపట్టిన కోర్ట్ సైతం బాధితుడి సహధర్మచారిణి భార్యేకాబట్టి, ఆస్పత్రిలో భద్రపరిచిన వీర్యం కోడలికే చెందుతుందంటూ తీర్పిచ్చింది. ప్రస్తుతం ఈ అంశం చర్చాంశనీయంగా మారింది.