తల్లి కడసారి చూపు కోసం.. 1100కి.మీ ప్రయాణించిన జవాన్

దిశ వెబ్ డెస్క్: ఓ జవాను పుట్టిన ఊరికి దూరంగా డ్యూటీ చేస్తున్నాడు. అమ్మకు బాగా లేదని ఫోన్ వచ్చింది. కానీ భారతమాతా, భారతీయులు విపత్తుల్లో ఉన్నవేళ తన సేవ అవసరమని భావించాడు. డ్యూటీలో నిమగ్నమయ్యాడు. అంతలోనే మరో కాల్ .. ఈ సారి అమ్మ ఈ లోకాన్ని వీడిందనే మాట చెవిన పడింది. ఒక్కసారిగా గుండె బరువెక్కిపోయింది. చెమ్మగిల్లిన కన్నులతో, బరువెక్కని హృదయంతో నాన్న గురించి ఆలోచించసాగాడు. దేశమంతా లాక్ డౌన్.. చెల్లి, తమ్ముడు ముంబైలో […]

Update: 2020-04-12 06:29 GMT
తల్లి కడసారి చూపు కోసం.. 1100కి.మీ ప్రయాణించిన జవాన్
  • whatsapp icon

దిశ వెబ్ డెస్క్: ఓ జవాను పుట్టిన ఊరికి దూరంగా డ్యూటీ చేస్తున్నాడు. అమ్మకు బాగా లేదని ఫోన్ వచ్చింది. కానీ భారతమాతా, భారతీయులు విపత్తుల్లో ఉన్నవేళ తన సేవ అవసరమని భావించాడు. డ్యూటీలో నిమగ్నమయ్యాడు. అంతలోనే మరో కాల్ .. ఈ సారి అమ్మ ఈ లోకాన్ని వీడిందనే మాట చెవిన పడింది. ఒక్కసారిగా గుండె బరువెక్కిపోయింది. చెమ్మగిల్లిన కన్నులతో, బరువెక్కని హృదయంతో నాన్న గురించి ఆలోచించసాగాడు. దేశమంతా లాక్ డౌన్.. చెల్లి, తమ్ముడు ముంబైలో ఉండిపోయారు. వాళ్లు కదల్లేని పరిస్థితి. అమ్మ చివరి చూపు కూడా చూడలేని స్థితి. నాన్నేమో ఒంటరయ్యారు. వెంటనే పై అధికారుల దగ్గర పర్మిషన్ తీసుకుని.. తల్లి చివరి చూపు చూసేందుకు 1100 కిలోమీటర్ల ప్రయాణమయ్యాడు. లారీలు, ట్రక్కులు, గూడ్స్ రైళ్లు ఎక్కి.. చివరకు ఊరికి చేరుకున్నాడు. తల్లిని ఆఖరిసారి చూడటంతో పాటు, తండ్రికి తోడుగా నిలిచాడు.

కరోనాతో దేశమంతా లాక్ డౌన్ కొనసాగుతోంది. ఉద్యోగ విధుల్లో భాగంగా.. ఉత్తరప్రదేశ్ కు చెందిన సంతోష్ యాదవ్ నక్సల్ ప్రభావిత ప్రాంతమైన బీజాపూర్ జిల్లాలో పోస్టింగ్ లో ఉన్నాడు. ఉద్యోగ నిర్వహణ లో ఉండగా తల్లి మరణించిదనే వార్త తెలిసింది. బరువెక్కిన హృదయంతో ఊరికి పయనమయ్యాడు. లాక్ డౌన్ సమయంలో ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి 1100 కిలోమీటర్లు ప్రయాణించి ఇంటికి చేరుకున్నాడు. తల్లిని కడసారి చూడటంతో పాటు, తండ్రిగా తోడుగా నిలిచాడు. ప్రయాణంలో తనకు సహకరించిన అందరికీ థ్యాంక్స్ చెప్పాడు. “బీజాపూర్ శివారులోని క్యాంపులో ఉన్నప్పుడు నాన్న ఫోన్ చేసి అమ్మ కండిషన్ సీరియస్ గా ఉందని వారణాసికి తరలిస్తున్నామని చెప్పారు. ఆ తర్వాతి రోజు సాయంత్రం అమ్మ చనిపోయిందని తెలిపాడు. ఎలాగైనా ఊరికి వెళ్లాలని అనుకున్నా. తమ్ముడు, చెల్లి ముంబైలో ఉంటారు. వాళ్లు ఊరికి చేరుకోవడం సాధ్యం కాదు. ఇలాంటి పరిస్థితిలో నాన్నను ఒంటరిగా వదిలేయకూడదని అనుకున్నా. రిలీవింగ్ లెటర్ తీసుకుని ఇంటికి బయలుదేరా. బీజాపూర్ నుంచి కొండగావ్ కు లారీ, మినీ లారీలో చేరుకున్నా. కొండగావ్ దగ్గర పోలీసులు ఆపితే నా పరిస్థితి గురించి చెప్పా. వాళ్లు మెడిసిన్స్ తరలించే వెహికల్ లో రాయ్ పూర్ కు పంపారు. రాయ్ పూర్ లో ఆర్పీఎఫ్ లో పని చేసే ఫ్రెండ్ సాయంతో గూడ్స్ ట్రైన్ ఎక్కా. అక్కడి నుంచి 8 గూడ్స్ ట్రైన్లు మారి చునార్ చేరుకున్నా. 5 కిలోమీటర్లు నడిచి బోటులో గంగా నదిని దాటి మా ఊరికి చేరుకున్నా. ఊరికి రావడానికి మూడు రోజులు పట్టింది” అని సంతోష్ అన్నాడు. తన గ్రామానికి చెందిన 78 మంది రైల్వేలో పని చేస్తారని, వాళ్లంతా తనకు హెల్ప్ చేశారని సంతోష్ గుర్తు చేసుకున్నాడు. సంతోష్ చత్తీస్ గఢ్ ఆర్మ్డ్ ఫోర్స్ 15వ బెటాలియన్ లో పని చేస్తున్నాడు.

tags: lockdown, jawan, mother, death, 1100 km, chhattisgarh, uttar pradesh

Tags:    

Similar News