Jeera: నల్ల జీలకర్రను ఇలా వాడితే ఆ సమస్యలకు చెక్ పెట్టొచ్చు!
నల్ల జీలకర్ర వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి
దిశ, వెబ్ డెస్క్ : శరీరంలో షుగర్ లెవెల్స్ పెరిగితే దానిని తగ్గించడం చాలా కష్టమవుతుంది. డయాబెటిస్‌లో రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటే అది శరీరాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది. బ్లడ్ లో షుగర్ పెరగడానికి ముఖ్య కారణం ఆహారపు అలవాట్లు. మనం తినే ఆహారాలలో కొన్ని మార్పులు చేసుకుని ఇంటి చిట్కాలతో రక్తంలో చక్కెరను నియంత్రించవచ్చు. మనం వండుకునే వంటలలో మసాలా దినుసులను ఉపయోగిస్తుంటాం. వాటిలో నల్ల జీలకర్ర కూడా ఒకటి.
నల్ల జీలకర్ర ( jeera ) వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీనిని ఔషధంగా కూడా ఉపయోగించవచ్చు. మనం ఈ నల్ల జీలకర్రతో చెడు కొలెస్ట్రాల్‌తో పాటు బ్లడ్ లో ఉండే షుగర్ ను నియంత్రించడంలో సహాయపడుతుంది. దీనిలో విటమిన్లు, ఖనిజాలుంటాయి, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది జీర్ణక్రియ దగ్గరి నుంచి ఇమ్యూనిటీ పవర్ వరకు పెంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇది శ్వాసకోశ సమస్యలకు చెక్ పెడుతుంది. నల్ల జీలకర్ర స్త్రీలకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది గర్భాశయ వాపును తగ్గిస్తాయి.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.