‘మంత్రి కాబట్టే జై ఈటల అన్నాం… కేసీఆరే మా అధినేత’

దిశ ప్రతినిధి, కరీంనగర్: ఉమ్మడి జిల్లా నుండి మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారన్న కారణంగానే తాము కానీ, తమ నాయకుడు కానీ ఈటలకు సాన్నిహిత్యంగా ఉన్నారే తప్ప మరో కారణం ఏమీ లేదని మంథని టీఆర్ఎస్ నాయకులు స్పష్టం చేశారు. ఇక నుండి మంథని కేడర్ అంతా కూడా కేసీఆర్ నాయకత్వాన్ని మాత్రమే సమర్థిస్తుందని స్పష్టం చేసింది. గురువారం పెద్దపల్లి జిల్లా మంథనిలో టీఆర్ఎస్ శ్రేణులు మీడియాతో మాట్లాడుతూ… 2014లో కవిత ఆశీస్సులతో మంథని ఎమ్మెల్యేగా గెల్చిన పుట్ట […]

Update: 2021-05-06 03:06 GMT

దిశ ప్రతినిధి, కరీంనగర్: ఉమ్మడి జిల్లా నుండి మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారన్న కారణంగానే తాము కానీ, తమ నాయకుడు కానీ ఈటలకు సాన్నిహిత్యంగా ఉన్నారే తప్ప మరో కారణం ఏమీ లేదని మంథని టీఆర్ఎస్ నాయకులు స్పష్టం చేశారు. ఇక నుండి మంథని కేడర్ అంతా కూడా కేసీఆర్ నాయకత్వాన్ని మాత్రమే సమర్థిస్తుందని స్పష్టం చేసింది. గురువారం పెద్దపల్లి జిల్లా మంథనిలో టీఆర్ఎస్ శ్రేణులు మీడియాతో మాట్లాడుతూ… 2014లో కవిత ఆశీస్సులతో మంథని ఎమ్మెల్యేగా గెల్చిన పుట్ట మధు టీఆర్ఎస్ అభ్యున్నతి కోసం పని చేశారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో మంథనిని అన్నింటా అభివృద్ది చేశారన్నారు.

2018లో దురదృష్టవశాత్తు ఎమ్మెల్యేగా ఓడిపోయినా పెద్దపల్లి జిల్లాపరిషత్ చైర్మన్‌గా అవకాశం కల్పించిన కేసీఆర్ నాయకత్వమే తమకు శిరోధార్యమని మంథని టీఆర్ఎస్ నాయకులు స్పష్టం చేశారు. అధినేత కేసీఆర్ విషయంలో కానీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితక్కల పట్ల జడ్పీ చైర్మన్ పుట్ట మధుతో పాటు తామంతా కూడా విధేయులగానే ఉంటామని అన్నారు. పార్టీకి దూరమైన ఈటలకు తామూ దూరంగానే ఉంటామని, పార్టీయే సుప్రీం తప్ప ఈటల రాజేందర్ మాత్రం కాదని తేల్చిచెప్పారు. ఈటల ఎపిసోడ్‌ను అడ్డం పెట్టుకుని మంథని టీఆర్‌ఎస్‌లో చీలిక తెచ్చి లబ్ది పొందాలని కొందరు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు.

Tags:    

Similar News