కరోనా బారిన పడుతున్న క్యాబ్ డ్రైవర్లు..!

దిశ, తెలంగాణ బ్యూరో: కరోనా పరిస్థితుల్లో బతుకుదెరువు కోసం పనిచేస్తున్న డ్రైవర్లు కరోనా బారిన పడుతున్నారు. ఆర్థిక సమస్యలను ఎదుర్కునేందుకు డ్యూటీలు చేస్తుంటే.. వైరస్​సోకడంతో తామంతా రోడ్ల మీదకు వస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ మార్గనిర్దేశకాలను కూడా అమల్లోకి తీసుకురాని పరిస్థితుల్లో ప్రభుత్వం, భాగస్వామ్య కంపెనీలు ఉంటే ఎలా అని నిలదీస్తున్నారు. ఆశలపై నీళ్లు చల్లిన కరోనా.. నగరంలో డ్రైవర్​ కం ఓనర్లుగా పనిచేస్తూ జీవనం సాగిద్దామనుకున్న వారి ఆశలపై కరోనా నీళ్లు చల్లినట్లయింది. […]

Update: 2021-05-01 08:14 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కరోనా పరిస్థితుల్లో బతుకుదెరువు కోసం పనిచేస్తున్న డ్రైవర్లు కరోనా బారిన పడుతున్నారు. ఆర్థిక సమస్యలను ఎదుర్కునేందుకు డ్యూటీలు చేస్తుంటే.. వైరస్​సోకడంతో తామంతా రోడ్ల మీదకు వస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ మార్గనిర్దేశకాలను కూడా అమల్లోకి తీసుకురాని పరిస్థితుల్లో ప్రభుత్వం, భాగస్వామ్య కంపెనీలు ఉంటే ఎలా అని నిలదీస్తున్నారు.

ఆశలపై నీళ్లు చల్లిన కరోనా..

నగరంలో డ్రైవర్​ కం ఓనర్లుగా పనిచేస్తూ జీవనం సాగిద్దామనుకున్న వారి ఆశలపై కరోనా నీళ్లు చల్లినట్లయింది. గ్రేటర్​ పరిధిలో ఓలా, ఊబర్​వంటి కంపెనీలతో ఒప్పందాల్లో 1.25 లక్షల క్యాబ్‌లు నడుస్తుండగా.. ఐటీ కంపెనీల్లో 33 వేలు ఉన్నాయి. కరోనా కాలంలో వర్క్​ఫ్రం హోమ్​ఇవ్వడంతో వారు కూడా యాప్​ బేస్​డ్​ కంపెనీలతో కలిసి పనిచేస్తున్నారు. నగరంలో చేస్తున్న ప్రయాణాల్లో ఎక్కువ భాగం కొవిడ్​ కేసులనే తరలిస్తున్నామని డ్రైవర్లు చెబుతున్నారు. ఇదే తరుణంలో డ్రైవర్లు కూడా కొవిడ్​బారిన పడుతున్నారు.

ఏప్రిల్​ నెలలో మొత్తం 75 మంది ప్రయాణీకులను గమ్య స్థానాలకు చేర్చగా… 45 మంది కొవిడ్​ పాజిటివ్​ వ్యక్తులేనని ఓ క్యాబ్​ డ్రైవర్​ మల్లేష్​ ‘దిశ’కు ​తెలిపారు. పేషెంట్లను తరలించే క్రమంలో డ్రైవర్లు కరోనా బారిన పడి మరణించడం దారుణమన్నారు. ఇప్పటికే ఓలా, ఉబెర్​ కంపెనీల్లో 407, ఫుడ్​ డెలీవరీ సంస్థల్లో 281 మంది కొవిడ్​ బారిన పడగా.. మరో నలుగురు డ్రైవర్లు మరణించారు. కరోనా సమయంలో కూడా పనిచేస్తున్నప్పటికీ.. కంపెనీలు కనీసం తమ రక్షణ బాధ్యతలను తీసుకోవడం లేదని డ్రైవర్లు వాపోతున్నారు. తామ కష్టం మీద ఆదాయాన్ని సంపాదిస్తున్న యాప్​ బేస్​డ్​ సంస్థలు కనీసం శానిటైజర్లు, మాస్క్‌లు, కొవిడ్​ కిట్స్ వంటివి అందించకపోవడంతో ప్రమాదకరస్థితిలోనే జీవనాన్ని నెట్టుకొస్తున్నామని గోడు వెల్లబోసుకుంటున్నారు.

కనీసం తమకు ఇన్సూరెన్స్​ సౌకర్యం కూడా కల్పించడం లేదని.. సోషల్ సెక్యూరిటీ కోడ్​నిబంధనల ప్రకారం.. అగ్రిమెంట్​బేస్​డ్ పనిచేస్తున్న డ్రైవర్లకు ఇన్యూరెన్స్ కల్పించాల్సిన బాధ్యత ఆ కంపెనీలపై ఉంటుందంటున్నారు. కరోనాతో డ్రైవర్లు చనిపోతే కుటుంబం పరిస్థితి ఏంటని కన్నీరు పెట్టుకుంటున్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం, సదరు కంపెనీలు చొరవ చూపి ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

Tags:    

Similar News