ఓటీటీ రిలీజ్‌కు అశ్వినీదత్ సపోర్ట్!
హీరో సూర్య కొత్త చిత్రం ‘ఆకాశమే నీ హద్దురా’. ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకులు గోపీనాథ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాకు మంచి బజ్ ఏర్పడింది. ట్రైలర్ బెస్ట్ కాంప్లిమెంట్స్ అందుకోగా, పాటలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. సుధా కొంగర డైరెక్షన్‌లో వస్తున్న సినిమాకు సూర్య నిర్మాత కాగా.. కరోనా కారణంగా సినిమాను అమెజాన్ ప్రైమ్‌లో అక్టోబర్ 30న రిలీజ్ చేసేందుకు డిసైడ్ అయ్యారు. అయితే, ఈ నిర్ణయంపై పునరాలోచించాలని సూర్యకు ఓపెన్ లెటర్ రాశారు […]
హీరో సూర్య కొత్త చిత్రం ‘ఆకాశమే నీ హద్దురా’. ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకులు గోపీనాథ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాకు మంచి బజ్ ఏర్పడింది. ట్రైలర్ బెస్ట్ కాంప్లిమెంట్స్ అందుకోగా, పాటలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. సుధా కొంగర డైరెక్షన్‌లో వస్తున్న సినిమాకు సూర్య నిర్మాత కాగా.. కరోనా కారణంగా సినిమాను అమెజాన్ ప్రైమ్‌లో అక్టోబర్ 30న రిలీజ్ చేసేందుకు డిసైడ్ అయ్యారు.
అయితే, ఈ నిర్ణయంపై పునరాలోచించాలని సూర్యకు ఓపెన్ లెటర్ రాశారు సూపర్ హిట్ డైరెక్టర్ హరి. మన ఇద్దరి కాంబినేషన్‌లో బ్లాక్ బస్టర్స్ అందుకున్నామని.. ఆ ఫ్రెండ్‌షిప్‌తోనే ఈ సూచన చేస్తున్నట్లు చెప్పారు. మీ అభిమానిగా మీ సినిమాను థియేటర్‌లోనే చూడాలి అనుకుంటున్నానని, ఓటీటీలో కాదని చెప్పాడు. అంతేకాదు, సినిమా థియేటర్‌లో రిలీజ్ అయితేనే ఫిల్మ్ మేకర్స్‌కు నేమ్, ఫేమ్ దక్కుతాయని అభిప్రాయపడ్డారు. థియేటర్స్‌లో మన సినిమాలకు గ్రేట్ రెస్పాన్స్ వచ్చిందని.. అందుకే మనం ఇంత గొప్ప పొజిషన్‌లో ఉండగలిగామని.. అది మరచిపోవద్దని చెప్పాడు. సినిమాను దేవుడిగా అభివర్ణించిన డైరెక్టర్ హరి.. సినిమా థియేటర్‌లోకి వస్తేనే మనకు గౌరవం లభిస్తుందని అన్నారు.
కాగా, డైరెక్టర్ హరి అభిప్రాయాన్ని వ్యతిరేకించారు నిర్మాత సి. అశ్వినీ దత్. సినిమా హాళ్లు ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియదని.. ఇప్పుడు థియేటర్స్ ఓపెన్ అయినా సినిమా రిలీజ్ చేసి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడటం తప్పని అన్నారు. ప్రేక్షకులను, వారి ఆరోగ్యాన్ని, ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఓటీటీలో సినిమా విడుదల చేస్తున్న సూర్యను అభినందించారు. ఏ నటుడికైనా తన కెరియర్‌లో 25వ చిత్రం మైలురాయిగా నిలుస్తుంది. అలాంటిది నాని ‘వి’ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తున్నందుకు అప్రిషియేట్ చేశారు.