బైజూస్ చేతికి ఆకాష్ ఎడ్యుకేషన్ సర్వీసెస్!
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ అతిపెద్ద ఆన్‌లైన్ ఎడ్‌టెక్ స్టార్టప్ సంస్థ బైజూస్ మరో ఎడ్యుకేషన్ సర్వీసెస్ సంస్థను కొనుగోలు చేయనున్నట్టు ప్రకటించింది. ఆకాష్ ఎడ్యుకేషన్‌ను సుమారు రూ. 7,300 కోట్లను చెల్లించి కొనుగోలు చేయనున్నట్టు తెలిపింది. ఈ కొనుగోలు తర్వాత దేశీయ అతిపెద్ద ఎడ్యుకేషన్ ఒప్పందంగా నిలుస్తుందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. గతేడాది కరోనా కారణంగా ఆన్‌లైన్ తరగతులకు డిమాండ్ భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బైజూస్ సంస్థ నిధుల సమీకరణ ప్రక్రియను చేపట్టింది. […]
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ అతిపెద్ద ఆన్‌లైన్ ఎడ్‌టెక్ స్టార్టప్ సంస్థ బైజూస్ మరో ఎడ్యుకేషన్ సర్వీసెస్ సంస్థను కొనుగోలు చేయనున్నట్టు ప్రకటించింది. ఆకాష్ ఎడ్యుకేషన్‌ను సుమారు రూ. 7,300 కోట్లను చెల్లించి కొనుగోలు చేయనున్నట్టు తెలిపింది. ఈ కొనుగోలు తర్వాత దేశీయ అతిపెద్ద ఎడ్యుకేషన్ ఒప్పందంగా నిలుస్తుందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. గతేడాది కరోనా కారణంగా ఆన్‌లైన్ తరగతులకు డిమాండ్ భారీగా పెరిగిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే బైజూస్ సంస్థ నిధుల సమీకరణ ప్రక్రియను చేపట్టింది. ఇటీవలే ఫేస్‌బుక్‌తో పాటు బాండ్ కేపిటల్, టైగర్ గ్లోబల్ మేనేజ్‌మెంట్ కంపెనీల నుంచి నిధులను అందుకుంది. ఈ ఒప్పందాలతో బైజూస్ విలువ సుమారు రూ. 88 వేల కోట్లకు చేరుకుందని సమాచారం. ఈ క్రమంలోనే ఆకాష్ ఎడ్‌టెక్ సర్వీసెస్ సంస్థను కొనుగోలు చేసింది. దేశీయంగా మెడికల్, ఇంజనీరింగ్ విద్య శిక్షణలో విస్తరించిన ఆకాష్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ 200 వరకు శిక్షణా కేంద్రాలను కలిగి ఉంది.