ఆకాష్ ఎడ్యుకేషన్‌ను కొనుగోలు చేసిన బైజూస్
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఎడ్-టెక్ సంస్థ బైజూస్ సోమవారం ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్‌ను కొనుగోలు చేసినట్టు ప్రకటించింది. దీని విలువ సుమారు రూ. 7,300 కోట్లుగా తెలిపింది. ఈ ఒప్పందం ద్వారా దేశీయంగా పరీక్షల తయారీ విభాగంలో భారత ఉనికిని బలోపేతం చేస్తుందని బైజూస్ పేర్కొంది. అలాగే, దేశీయంగా అభివృద్ధి చెందుతున్న ఎడ్-టెక్ పరిశ్రమలో ఇప్పటిక్వరకు అతిపెద్ద ఒప్పందంగా పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. అయితే, ఆకాష్ ఎడ్యుకేషన్ ఒప్పందం తర్వాత కూడా స్వతంత్రంగా పనిచేయనుంది. వ్యవస్థాపకులు […]
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఎడ్-టెక్ సంస్థ బైజూస్ సోమవారం ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్‌ను కొనుగోలు చేసినట్టు ప్రకటించింది. దీని విలువ సుమారు రూ. 7,300 కోట్లుగా తెలిపింది. ఈ ఒప్పందం ద్వారా దేశీయంగా పరీక్షల తయారీ విభాగంలో భారత ఉనికిని బలోపేతం చేస్తుందని బైజూస్ పేర్కొంది. అలాగే, దేశీయంగా అభివృద్ధి చెందుతున్న ఎడ్-టెక్ పరిశ్రమలో ఇప్పటిక్వరకు అతిపెద్ద ఒప్పందంగా పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. అయితే, ఆకాష్ ఎడ్యుకేషన్ ఒప్పందం తర్వాత కూడా స్వతంత్రంగా పనిచేయనుంది. వ్యవస్థాపకులు ఆకాష్ చౌదరీ, జేసీ చౌదరీ సంస్థను కొనసాగించనున్నారు.
టెస్-ప్రిపరేషన్ విభాగంలో అగ్రగామిగా ఉన్న ఆకాష్ ఎడ్యుకేషన్‌తో ఒప్పందం వ్యూహాతమక భాగస్వామ్యమని బైజూస్ వివరించింది. ఒప్పందంలో భాగంగా ఆకాష్ ఎడ్యుకేషన్ వ్యవస్థాపకులు బైజూస్‌లో వాటాదారులుగా మారనున్నారు. దేశీయంగా అత్యంత విలువైన ఎడ్-టెక్ స్టార్టప్ కంపెనీ బైజుస్‌కు మేరీ మీకర్, యూరి మిల్నర్, టెన్సెంట్, సీక్వోయూ కేపిటల్, టైగర్ గ్లోబల్ ఇంకా ఇతర పెట్టుబడిదారుల మద్దతు ఉంది. ఇప్పటివరకు బైజూస్ కంపెనీ 2 బిలియన్లకు పైగా నిధులను సమీకరించినట్టు అంచనా. గతమ్ళో బైజూస్ సంస్థ ట్యూటర్ విస్టా, ఎడ్యూరైట్, ఓస్మో స్టార్టప్‌లను కొనుగోలు చేసింది.