రైళ్లో వెళ్తూనే నచ్చిన ఫుడ్ ఆర్డర్.. IRCTCతో జతకట్టిన Zomato

ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(IRCTC) తాజాగా ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జోమాటోతో డీల్ కుదుర్చుకుంది.

Update: 2023-10-18 11:20 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(IRCTC) తాజాగా ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జోమాటోతో డీల్ కుదుర్చుకుంది. ఇకమీదట ప్రయాణికులు రైళ్లో ప్రయాణిస్తూనే నేరుగా నచ్చిన ఫుడ్‌ను ఆర్డర్ చేయవచ్చు. IRCTCకి చెందిన ఈ క్యాటరింగ్ ద్వారా ఫుడ్ ఆర్డర్ చేస్తే డెలివరీ సంస్థ జోమాటో నేరుగా ప్రయాణికులు కూర్చున్న చోటికి ఫుడ్‌ను తీసుకొచ్చి అందించే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నారు.

ప్రయాణికులు ముందుగానే ఫుడ్ ఆర్డర్ చేస్తే జోమాటో బాయ్ ఆయా స్టేషన్లలో వారికి డెలివరీ చేస్తారు. ప్రస్తుతానికి ఈ సేవలను ఎంపిక చేసిన ఐదు స్టేషన్లలో మాత్రమే తీసుకొచ్చారు. అవి న్యూ ఢిల్లీ, ప్రయాగ్‌రాజ్, కాన్పూర్, లక్నో, వారణాసి స్టేషన్లు. త్వరలో ఈ సదుపాయాన్ని దేశ వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురానున్నారు. రైలు ప్రయాణికులు తమకు నచ్చిన ఫుడ్‌ను తినే విధంగా ఎక్కువ ఆప్షన్లను అందించడానికి ఈ సదుపాయం తీసుకొచ్చినట్లు IRCTC తెలిపింది.

Tags:    

Similar News