అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌కు పోటీ ఇవ్వడానికి జొమాటో సరికొత్త ప్లాన్

వేగంగా అభివృద్ధి చెందుతున్న డైరెక్ట్-టూ-కన్స్యూమర్(డీ2సీ) విభాగంలోకి అడుగుపెట్టాలని కంపెనీ ప్రణాళిక రూపొందించింది.

Update: 2024-02-19 08:15 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈ-కామర్స్ రంగంలో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఇప్పటికీ ఆధిపత్యం కొనసాగిస్తున్నాయి. మీషో, అజియో లాంటి ప్లాట్‌ఫామ్స్ ఉన్నప్పటికీ ఎక్కువ ఆర్డర్లతో ఈ రెండూ మార్కెట్లో దూకుడుగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ కంపెనీలకు గట్టిగా పోటీ ఇవ్వడానికి సరికొత్త ప్లాన్‌ను సిద్ధం చేసింది. తన క్విక్-కామర్స్ ప్లాట్‌ఫామ్ బ్లింక్ఇట్‌ను మరింత వేగంగా విస్తరించనుంది. ముఖ్యంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న డైరెక్ట్-టూ-కన్స్యూమర్(డీ2సీ) విభాగంలోకి అడుగుపెట్టాలని కంపెనీ ప్రణాళిక రూపొందించింది. ఈ విభాగంలో కార్యకలాపాలను మరింత సులభతరం చేసేందుకు జొమాటో ఇతర బ్రాండ్లను కొనుగోలు చేసి బ్లింక్ఇట్‌తో అనుసంధానం చేయనుంది. నేరుగా బ్రాండెడ్ ఉత్పత్తులను సేకరించడం, స్టాక్‌ నిర్వహణ, సొంత సరఫరా వ్యవస్థను నిర్మించడానికి ఇది ఉపయోగపడుతుందని జొమాటో భావిస్తోంది. ఆయా ఉత్పత్తులను బ్లింకిట్ ద్వారా జొమాటో డెలివరీ చేస్తుంది. హోమ్ ప్రోడక్ట్స్, చిన్న ఎలక్ట్రానిక్స్, బ్యూటీ అండ్ పర్సనల్ విభాగాల్లో కొత్త బ్రాండ్లను అందుబాటులో ఉంచాలని జొమాటో ప్రయత్నిస్తోంది. దీనివల్ల అమ్మకాలు మరింత ఊపందుకోంటాయని పేర్కొంది. 

Tags:    

Similar News