Zomato: లైవ్ ఈవెంట్‌లు, డైనింగ్ కోసం కొత్త యాప్ తీసుకొచ్చిన జొమాటో
లైవ్ ఈవెంట్, టెకెట్ బుకింగ్స్, డైనింగ్ వంటి వివిధ రకాల సేవల కోసం 'డిస్ట్రిక్ట్' అనే యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో కొత్త సేవలను ప్రారంభించింది. వినియోగదారులకు మరిన్ని సేవలందించే లక్ష్యంలో భాగంగా లైవ్ ఈవెంట్, టెకెట్ బుకింగ్స్, డైనింగ్ వంటి వివిధ రకాల సేవల కోసం 'డిస్ట్రిక్ట్' అనే యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. యాప్ స్టోర్ వివరాల ప్రకారం, డిస్ట్రిక్ట్ యాప్ ప్రస్తుతం కంపెనీ డైనింగ్ అవుట్ ఆఫర్‌ను అందించడంతో పాటు సినిమాలు, లైవ్ ఈవెంట్‌ల కోసం టిక్కెట్‌లను బుక్ చేసుకోవడానికి వీలుంటుంది. స్పోర్ట్స్ టికెట్, లైవ్‌షో, డైనింగ్, షాపింగ్ సేవలు కూడా ఈ యాప్‌లో ఉన్నాయి. ఈ ఏడాది ఆగష్టులో పేటీఎం నుంచి టికెటింగ్ వ్యాపారాన్ని జొమాటో కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. జొమాటో ప్రధాన యాప్‌లో ఉన్న వాటిని, పేటీఎం నుంచి కొనుగోలు చేసిన టికెటింగ్ వ్యాపారాలను డిస్ట్రిక్ట్ యాప్‌కు మారుస్తామని, వచ్చే ఏడాది ఆగష్టు చివరి వరకు మాత్రమే పేటీఎం యాప్‌లో టికెటింగ్ సేవలు కొనసాగుతాయని కంపెనీ పేర్కొంది.