Zomato: జొమాటో ఉద్యోగులకు గుడ్ న్యూస్..రూ.330 కోట్ల విలువైన షేర్లను కేటాయిస్తూ నిర్ణయం

ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ(Online Food Delivery) సంస్థ జొమాటో(Zomato) షేర్లు స్టాక్ మార్కెట్(Stock Market)లో గత కొన్ని నెలలుగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.

Update: 2024-10-05 14:52 GMT

దిశ, వెబ్‌డెస్క్:ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ(Online Food Delivery) సంస్థ జొమాటో(Zomato) షేర్లు స్టాక్ మార్కెట్(Stock Market)లో గత కొన్ని నెలలుగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం(First Quarter) ఫలితాలను జొమాటో గురువారం ప్రకటించింది.ఈ క్యూ1 లో జొమాటో నికర లాభం(Net Profit) గతేడాది క్యూ1 తో పోలిస్తే 126.5 రెట్లు పెరిగింది.ఈ నేపథ్యంలో తన ఉద్యోగులకు దాదాపు 1.2 కోట్ల స్టాక్(Stock)లను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.ఎంప్లాయ్ స్టాక్ ఓనర్ షిప్(Employee Stock Ownership) కింద 1,19,97,768 షేర్లను ఉద్యోగులకు కేటాయించేందుకు జొమాటో ఆమోదం తెలిపింది.ఈ షేర్ల విలువ దాదాపు రూ.330.17 కోట్లుగా ఉంటుందని తెలిపింది.ఈ విషయాన్ని ఇటీవల కంపెనీ ఎక్స్చేంజ్ ఫైలింగ్(Company Exchange Filing)లో ప్రకటించింది.మొత్తం షేర్లలో 1,19,97,652 షేర్లు 'ఈఎస్ఓపీ(ESOP) 2021' ప్లాన్ కిందకు వస్తాయని,మరో 116 షేర్లు 'ఈఎస్ఓపీ(ESOP) 2014' కిందకు వస్తాయని తెలిపింది.అయితే ఉద్యోగులకు కేటాయించిన షేర్లు లాకిన్ ప్రక్రియకు లోబడి ఉండవని పేర్కొంది.కాగా ఈఎస్ఓపీలు అనేవి ఉద్యోగులకు పరిహారంగా ఇచ్చే కంపెనీ స్టాక్ షేర్లు.కావాలంటే ఉద్యోగులు వీటిని ఈక్విటీ షేర్(Equity Share)గా కూడా చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది.ఇక నిన్న మార్కెట్ ముగిసే సమయానికి జొమాటో షేర్లు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్(BSE)లో రూ.275.20 వద్ద ముగిశాయి. 


Similar News