Linkdin Ranks: వేగంగా ఎదుగుతున్న కంపెనీల జాబితాలో జెప్టో టాప్

గతేడాది సైతం జెప్టో అగ్రస్థానంలో నిలిచింది

Update: 2024-09-25 17:45 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్ జెప్టో వరుసగా రెండో ఏడాది టాప్ స్టార్టప్ ఇండియా జాబితా-2024లో అగ్రస్థానం సంపాదించుకుంది. ఎక్కువమంది ప్రొఫెషనల్స్ ఉద్యోగం చేయాలనుకునే అభివృద్ధి చెందుతున్న కంపెనీల కంపెనీలకు లింక్‌డ్ఇన్ సంస్థ ప్రతి ఏటా ర్యాంకింగ్స్ కేటాయిస్తుంది. గతేడాది సైతం జెప్టో అగ్రస్థానంలో నిలిచింది. ఈ జాబితాను లింక్‌డ్ఇన్ సంస్థ 100 కోట్ల కంటే ఎక్కువ మెంబర్స్ నుంచి అభిప్రాయాలను సేకరించి డేటాను రూపొందించింది. ఉపాధి పెరుగుదల, ఉద్యోగుల ఆసక్తి, ప్రతిభావంతుల నియామకాలు, పనితీరు వంటి కీలక అంశాల ఆధారంగా ర్యాంకులను కేటాయిస్తారు. లింక్‌డ్ఇన్ వివరాల ప్రకారం, జెప్టో తర్వాత స్ప్రింటో, క్లౌడ్ స్టోరేజ్ మేనేజ్‌మెంట్ ప్లాట్‌ఫామ్ లుసిడిటీ టాప్-3లో ఉన్నాయి. టాప్20లో 14 స్టార్టప్‌లు కొత్తగా ఈ జాబితాలో చోటు సంపాదించాయి. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ గోక్విక్, కన్వర్జేషన్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫారమ్ కాన్విన్, బయో ఫ్యూయల్ సప్లై చైన్ ప్లాట్‌ఫారమ్ బయోఫ్యూయల్ సర్కిల్, మెంటల్ హెల్త్ ప్లాట్‌ఫారమ్ మైండ్‌పీర్స్ కూడా జాబితాలో ఉన్నాయి.

Tags:    

Similar News