భారత GDP వృద్ధి అంచనాలు తగ్గించిన ప్రపంచ బ్యాంక్

2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ జీడీపీ వృద్ధి రేటును ప్రపంచ బ్యాంక్ తగ్గించింది.

Update: 2023-04-04 07:44 GMT

దిశ, వెబ్‌బెస్క్: 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ జీడీపీ వృద్ధి రేటును ప్రపంచ బ్యాంక్ తగ్గించింది. దీంతో FY24లో భారత్ GDP వృద్ధి 6.6% నుండి 6.3%కి తగ్గవచ్చని ప్రపంచ బ్యాంక్ మంగళవారం తన నివేదికలో పేర్కొంది. అలాగే.. FY24లో భారతదేశ కరెంట్ ఖాతా లోటు 5.2%గా ఉంటుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. అలాగే ప్రభుత్వ గణాంకాల ప్రకారం, భారతదేశం అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో 4.4 శాతం వృద్ధిని నమోదు చేసింది.

ప్రపంచ బ్యాంక్ నివేదిక ప్రకారం, నెమ్మదిగా వినియోగ వృద్ధి, సవాలు చేసే బాహ్య పరిస్థితుల కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ కుంచించుకుపోతుందని భావిస్తున్నారు. "పెరుగుతున్న రుణ ఖర్చులు, నెమ్మదిగా ఆదాయ వృద్ధి ప్రైవేట్ వినియోగ వృద్ధి పై ప్రభావం చూపుతుంది. మహమ్మారి సంబంధిత ఆర్థిక సహాయ చర్యల ఉపసంహరణ కారణంగా ప్రభుత్వ వినియోగం నెమ్మదిగా పెరుగుతుందని అంచనా వేయబడింది" అని ప్రపంచ బ్యాంక్ నివేదిక పేర్కొంది.

ఇవి కూడా చదవండి: 

Mahila Samman Saving Certificate :మహిళలకు వరం.. ‘మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్’ 

Tags:    

Similar News