Wipro Q2 Results: రెండో త్రైమాసికంలో భారీగా లాభాలను ఆర్జించిన విప్రో.. వాటాదారులకు 1:1 బోనస్ షేర్లు..!

భారతదేశం(India)లోని దిగ్గజ ఐటీ సేవల కంపెనీ(IT Services Company) విప్రో(Wipro) జులై-సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాల(July-September Quarter Results)ను ప్రకటించింది.

Update: 2024-10-18 16:43 GMT

దిశ, వెబ్‌డెస్క్: భారతదేశం(India)లోని దిగ్గజ ఐటీ సేవల కంపెనీ(IT Services Company) విప్రో(Wipro) జులై-సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాల(July-September Quarter Results)ను ప్రకటించింది. ఈ త్రైమాసికంలో విప్రో విశ్లేషకుల అంచనాలను మించి రాణించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25) రెండో త్రైమాసికం(Q2FY25)లో సంస్థ లాభం 21.2 వృద్ధి చెంది రూ. 3,208.80 కోట్ల నికర లాభాన్ని(Net profit) నమోదు చేసినట్లు విప్రో తెలిపింది. కాగా గతేడాది ఇదే త్రైమాసిక ఫలితాల నాటికి నికర లాభం రూ.2,646.30 కోట్లుగా ఉంది. ఇక కంపెనీ కార్యకలాపాల ఆదాయం రూ.22,515 కోట్ల నుంచి రూ.22,301.60 కోట్లకు పరిమితమైందని విప్రో తన రెగ్యులేటరీ ఫైలింగ్(Regulatory Filing)లో పేర్కొంది.

ఈ త్రైమాసికంలో భారీగా లాభాలను ఆర్జించిన నేపథ్యంలో విప్రో తన వాటాదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. వారికి 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్లు ఇవ్వాలని కంపెనీ డైరెక్టర్ల బోర్డు నిర్ణయించింది. ఈ సంవత్సరం డిసెంబర్ 15 వరకు వారి ఖాతాలో బోనస్ షేర్లు జమ చేస్తామని తెలిపింది. ఇక ఈ ఏడాది చివరికల్లా ఆఫర్ లెటర్ ఉన్నవారందరని ఉద్యోగంలోకి తీసుకుంటామని ఆ సంస్థ హ్యూమన్ రిసోర్సెస్(HR) హెడ్ సౌరభ్ గోవిల్(Saurabh Govil) ఓ ప్రకటనలో తెలిపారు. ప్రస్తుత ఫైనాన్సియల్ ఇయర్ నుంచే ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ ను జాబ్ లోకి చేర్చుకుంటున్నాం. అలాగే తొలి త్రైమాసికంలో 2,500 నుంచి 3,000 సిబ్బంది కొత్తగా ఉద్యోగంలో చేరారని, ప్రస్తుతం విప్రోలో 2,33,889 మంది ఉద్యోగులు ఉన్నారని ఆయన తెలిపారు.


Similar News