Airline services: వారానికి 25,007 విమాన సర్వీసులు.. శీతాకాల షెడ్యూల్ ప్రకటించిన డీజీసీఏ
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) శీతాకాలపు విమానాల షెడ్యూల్(Winter Flight Schedule)ను ప్రకటించింది.
దిశ, వెబ్‌డెస్క్: డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) శీతాకాలపు విమానాల షెడ్యూల్(Winter Flight Schedule)ను ప్రకటించింది. ఈ వింటర్ షెడ్యూల్లో దేశంలోని 124 విమానాశ్రయాల(124 Airports) నుండి వారానికి 25,007 విమాన సర్వీసులు(Airline services) బయలుదేరడానికి విమానయాన సంస్థలకు డీజీసీఏ అనుమతించింది. ఇది ప్రస్తుత వేసవి షెడ్యూల్(Summer schedule)తో పోలిస్తే మూడు శాతం ఎక్కువ. భారతీయ విమానయాన సంస్థలు వేసవి షెడ్యూల్లో 125 విమానాశ్రయాల నుంచి 24,275 విమాన సర్వీసులను నడిపాయి. ఇక గతేడాది శీతాకాల షెడ్యూల్‌తో పోలిస్తే ఈ సారి విమానాల సంఖ్య 5.37 శాతం పెరిగింది. ప్రస్తుత శీతాకాలపు షెడ్యూల్ అక్టోబర్ 27న ప్రారంభమై మార్చి 29, 2025 వరకు కొనసాగుతుందని డీజీసీఏ తెలిపింది.
షెడ్యూల్ ప్రకారం, ఇండిగో(Indigo) వారానికి 13,691 విమానాలను నడపబోతుంది. ఆ తర్వాత టాటా గ్రూప్ కు చెందిన ఎయిర్ ఇండియా(Air India) 2,586 విమానాలను నడపబోతుంది. ఇక ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్(Air India Express) 2,832, విస్తారా(Vistara) 2,193 , స్పైస్‌జెట్(Spicejet) 1,297, ఆకాశ ఎయిర్(Akasa Air) 989 విమానాల సర్వీసులను నిర్వహిస్తాయి. కాగా అతితక్కువగా అలయన్స్ ఎయిర్(Alliance Air) వారానికి 673 విమానాలను నడపబోతుంది.