Charlie Munger : వారెన్ బఫ్ఫెట్ రైట్‌హ్యాండ్ చార్లీ ముంగర్ కన్నుమూత
వారెన్ బఫ్ఫెట్ అంటే తెలియని వారు ఉండరు. ముఖ్యంగా షేర్ మార్కెట్లో ఆయన ఇన్వెస్ట్ చేసిన షేర్లన్ని కూడా మంచి లాభాలను ఇస్తాయని ఇన్వెస్టర్ల నమ్మకం
దిశ, వెబ్‌డెస్క్: వారెన్ బఫ్ఫెట్ అంటే తెలియని వారు ఉండరు. ముఖ్యంగా షేర్ మార్కెట్లో ఆయన ఇన్వెస్ట్ చేసిన షేర్లన్ని కూడా మంచి లాభాలను ఇస్తాయని ఇన్వెస్టర్ల నమ్మకం. ఆయనకు బెర్క్‌షైర్ హాత్‌వే అనే కంపెనీ ఉన్న విషయం కూడా చాలా మందికి తెలిసిందే. ఈ కంపెనీ ఎదుగుదలలో ముఖ్యపాత్ర పోషించిన వారెన్ బఫ్ఫెట్ రైట్‌హ్యాండ్ చార్లీ ముంగర్(99) మంగళవారం నాడు మరణించారు. కాలిఫోర్నియా ఆసుపత్రిలో ఆయన చనిపోయినట్లు బెర్క్‌షైర్ ఒక ప్రకటనలో తెలిపింది.
బెర్క్‌షైర్‌కు ముంగర్ వైస్ ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు. బెర్క్‌షైర్ హాత్‌వే అతిపెద్ద సామ్రజ్యంగా మారడానికి వారెన్ బఫ్ఫెట్‌కు అన్ని విధాల సహాయపడ్డాడు. ‘చార్లీ స్ఫూర్తి, జ్ఞానం, భాగస్వామ్యం లేకుండా బెర్క్‌షైర్ హాత్‌వే ప్రస్తుత స్థితికి రాలేకపొయేదని’ బఫ్ఫెట్ ఒక ప్రకటనలో తెలిపారు. బఫ్ఫెట్ తీసుకునే ప్రతి నిర్ణయం కూడా ముంగర్‌ను సంప్రదించాకే తీసుకునేవారని ఆయన సన్నిహితులు పేర్కొన్నారు.
కంపెనీకి వీరిద్దరు కూడా మెయిన్ పిల్లర్లుగా నిలిచారు. దాదాపు 1960 నుంచి వీరిద్దరి జర్నీ మొదలైంది. కంపెనీలను కొనుగోలు చేయడం, ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించారు. 2022 నాటికి బెర్క్‌షైర్‌ను ఏడాదికి 20 శాతం లాభాలు ఇచ్చే విధంగా అభివృద్ధి చేయడంలో వీరి పాత్ర చాలా ముఖ్యమైంది. చార్లీ ముంగర్ సంపద మొత్తం 2.2 బిలియన్ డాలర్ల వరకు ఉంటుంది.