Waaree Energies IPO: వారీ ఎనర్జీస్ ఐపీఓకు ఊహించని రెస్పాన్స్ .. బజాజ్, టాటా రికార్డులు బ్రేక్..!
సోలార్ ప్యానెల్ తయారీ కంపెనీ వారీ ఎనర్జీస్(Waaree Energies) కొన్ని రోజుల క్రితం ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్(IPO)లోకి వచ్చిన విషయం తెలిసిందే.
దిశ, వెబ్‌డెస్క్: సోలార్ ప్యానెల్ తయారీ కంపెనీ వారీ ఎనర్జీస్(Waaree Energies) కొన్ని రోజుల క్రితం ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్(IPO)లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఐపీఓ షేర్ల ద్వారా సుమారు రూ. 4,321 కోట్లను సమీకరించేందుకు వారీ ఎనర్జీస్ పబ్లిక్ ఇష్యూకు వచ్చింది. ఇందుకు సంబంధించిన సబ్‌స్క్రిప్షన్ అక్టోబర్ 21న ప్రారంభమై బుధవారం ముగిసింది. ఇదిలాఉంటే ఈ సంస్థ ఐపీఓకు ఊహించని రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు మొత్తం 76.36 రేట్ల బిడ్లు అందుకుంది. దీంతో అప్లికేషన్ల విషయంలో న్యూ రికార్డు క్రియేట్ చేసింది. మూడు రోజుల్లో దాదాపు 97 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. ఈ సబ్‌స్క్రిప్షన్ విలువ రూ. 2.41 లక్షల కోట్లుగా ఉండనున్నట్లు తెలుస్తోంది. కాగా ప్రైమరీ మార్కెట్ హిస్టరీలో ఇదే హైయెస్ట్ కావడం విశేషం. గతంలో ఈ రికార్డు బజాజ్ ఫైనాన్స్(Bajaj Finance) పేరిట ఉండేది. ఈ సంస్థ ఐపీఓకు 90 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. ఆ తరువాత టాటా టెక్నాలజీస్(Tata Technologies) ఐపీఓకు 73 లక్షల దరఖాస్తులు వచ్చాయి. తాజాగా వీటి రికార్డులను వారీ ఎనర్జీస్ బ్రేక్ చేసింది. రూ. 4,321 కోట్ల విలువైన షేర్లకు 160 కోట్ల షేర్ల బిడ్లు దాఖలైనట్లు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ద్వారా వెల్లడైంది. కాగా వారీ ఎనర్జీస్ కు సూరత్(Surat), నందిగ్రామ్(Nandigram), చిఖ్లీ(Chikhli), నోయిడా(Noida)లో ఐదు తయారీ యూనిట్లు ఉన్నాయి. మన దేశంలో సోలార్ ఎనర్జీ ఇండస్ట్రీలో వారీ ఎనర్జీస్ ఒకటిగా పేరు పొందింది.