Vistsra Free wifi: విస్తారా బంపర్ ఆఫర్.. ఇకపై విమానాల్లో ఉచిత వైఫై
విమాన ప్రయాణికులను ఆకట్టుకోడానికి ప్రముఖ దేశీయ విమానయాన సంస్థ విస్తారా బంపర్ ఆఫర్ తీసుకొచ్చింది
దిశ, బిజినెస్ బ్యూరో: విమాన ప్రయాణికులను ఆకట్టుకోడానికి ప్రముఖ దేశీయ విమానయాన సంస్థ విస్తారా బంపర్ ఆఫర్ తీసుకొచ్చింది. ఇకపై తన అంతర్జాతీయ విమానాల్లో 20 నిమిషాల పాటు ఉచితంగా వైఫై వాడుకునే సదుపాయాన్ని అందిస్తుంది. దీంతో మొట్టమొదటి సారిగా ఈ సేవలు అందించిన సంస్థగా విస్తారా రికార్డులకెక్కింది. ప్రస్తుతం ఇది బోయింగ్ 787-9 డ్రీమ్‌లైనర్, ఎయిర్‌బస్ A321neo ఎయిర్‌క్రాఫ్ట్‌లోని అన్ని క్యాబిన్‌లలో అందుబాటులో ఉంది. కాంప్లిమెంటరీ 20 నిమిషాల Wi-Fi యాక్సెస్‌ను అన్ని కెటగిరీల వారు వాడుకోవచ్చు. భారతీయ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌లను ఉపయోగించి అదనంగా కూడా వైఫై సమయాన్ని కొనుగోలు చేయవచ్చు.
50 MB డేటాను బిజినెస్ క్లాస్, ప్లాటినం క్లబ్ విస్తారా సభ్యులకు కాంప్లిమెంటరీగా అందిస్తారు. అదే లాయల్టీ కార్డ్ సభ్యులందరూ ఉచిత చాట్‌ను పొందుతారు. విస్తారా ఎయిర్‌లైన్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ దీపక్ రాజావత్ మాట్లాడుతూ, "విస్తారాలో, మా కస్టమర్ల అనుభవాన్ని నిరంతరం మెరుగుపరచడానికి కట్టుబడి ఉన్నాము. కస్టమర్లు దీనిని అభినందిస్తారని విశ్వసిస్తున్నాం" అని అన్నారు. విస్తారా, ప్రీమియర్ ఫుల్-సర్వీస్ ఎయిర్‌లైన్, టాటా గ్రూప్, సింగపూర్ ఎయిర్‌లైన్స్ జాయింట్ వెంచర్. గత నవంబర్‌లో కూడా, మలేషియా ఎయిర్‌లైన్స్ దాని అన్ని ఎయిర్‌బస్ A350,ఎంపిక చేసిన Airbus A330 ఎయిర్‌క్రాఫ్ట్‌లలో మెసేజింగ్, సోషల్ మీడియా యాప్‌ల కోసం అపరిమిత కాంప్లిమెంటరీ Wi-Fiని అందించడం ప్రారంభించింది.