భారీ స్థాయిలో పునర్నిర్మాణానికి సిద్ధమవుతున్న Vedanta..!
అనిల్ అగర్వాల్ నేతృత్వంలోని వేదాంతా గ్రూప్ సంస్థలో భారీ స్థాయిలో పునర్నిర్మాణానికి సిద్ధమవుతోంది.
ముంబై: అనిల్ అగర్వాల్ నేతృత్వంలోని వేదాంతా గ్రూప్ సంస్థలో భారీ స్థాయిలో పునర్నిర్మాణానికి సిద్ధమవుతోంది. సంస్థ వృద్ధిని మరింత వేగవంతం చేసేందుకు గ్రూప్‌లోని కమొడిటీ వ్యాపారాలను డీమెర్జర్ చేసి, మార్కెట్లలో లిస్ట్ చేయాలని భావిస్తున్నట్లు వేదాంత లిమిటెడ్ శుక్రవారం ప్రకటనలో తెలిపింది. వేదాంత అల్యూమినియం, వేదాంత ఆయిల్ అండ్ గ్యాస్, వేదాంత పవర్, వేదాంత స్టీల్, ఫెర్రస్ మెటీరియల్స్, వేదాంత బేస్ మెటల్, వేదాంత లిమిటెడ్‌తో ఆరు యూనిట్లను విడిగా లిస్ట్ చేయనున్నట్లు పేర్కొంది.
డీమెర్జర్ ద్వారా సంస్థ వాల్యూయేషన్‌ను పెంచడం, వేగవంతమైన వృద్ధి, సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు వీలవుతుందని ఛైర్మన్ అనిల్ అగర్వాల్ ఓ ప్రకటనలో చెప్పారు. డీమెర్జర్ తర్వాత వేదాంత కంపెనీ షేర్ ఉన్న ప్రతి స్టాక్ హోల్డర్ లిస్టింగ్ చేయబోయే ఐదు కంపెనీల్లో ఒక్కో షేర్ చొప్పున పొందనున్నారు. అన్ని అనుమతులను పొందిన తర్వాత పునర్నిర్మాణ ప్రక్రియ 2025 ఆర్థిక సంవత్సరం నాటికి పూర్తవుతుందని కంపెనీ భావిస్తోంది. ఈ ఏడాది అక్టోబర్‌లో డీమెర్జర్‌కు సంబంధించి మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆమోదానికి దాఖలు చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు వేదాంత వెల్లడించింది.
ఇవి కూడా చదవండి : Airtel కు భారీ జరిమానా విధించిన TRAI..!