CEO పదవీకాలం తర్వాత కోటక్ మహీంద్రా బ్యాంక్ నాన్-ఎగ్జిక్యూటివ్‌గా ఉదయ్ కోటక్

దేశీయ మూడవ అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ కోటక్ మహీంద్రా బ్యాంక్ ప్రస్తుత చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్ ఉదయ్ కోటక్ పదవీకాలం ఈ ఏడాది చివర్లో ముగియనుంది

Update: 2023-04-22 08:40 GMT

ముంబై: దేశీయ మూడవ అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ కోటక్ మహీంద్రా బ్యాంక్ ప్రస్తుత చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్ ఉదయ్ కోటక్ పదవీకాలం ఈ ఏడాది చివర్లో ముగియనుంది. ఆ తరువాత ఆయన బ్యాంకు నాన్-ఎగ్జిక్యూటివ్, నాన్-ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా కొనసాగుతారని బ్యాంకు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది.

కోటక్ మహీంద్రా బ్యాంక్‌ 1985లో నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థగా ప్రారంభమైంది, అప్పటి నుంచి దాని సీఈఓగా ఉదయ్ కోటక్ పనిచేస్తున్నారు. ఆర్‌బీఐ నిబంధనలను అనుసరించి, ఆయన డిసెంబర్ 31, 2023 నాటికి తన CEO పదవి నుండి వైదొలగనున్నారు. ఉదయ్ కోటక్‌ను బ్యాంక్‌కు నాన్-ఎగ్జిక్యూటివ్ నాన్-ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా నియమించాలనే తీర్మానంలో దాదాపు 99 శాతం ఓట్లు అనుకూలంగా వచ్చాయి.

బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ఉదయ్ కోటక్ నికర విలువ దాదాపు $13.4 బిలియన్లుగా ఉంది. కోటక్ మహీంద్రా బ్యాంక్ 2022 చివరి నాటికి భారతదేశం అంతటా 1,752 శాఖలను కలిగి ఉంది. ఇది 2003లో వాణిజ్య బ్యాంకుగా మారింది. బ్యాంకు తదుపరి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కోసం వెతుకులాటలో ఉంది.

Tags:    

Similar News