స్పామ్ కాల్స్, మెసేజ్‌ల విషయంలో ట్రాయ్ కీలక ఆదేశాలు

వివిధ కంపెనీలు తమ ఉత్పత్తులకు సంబంధించి ప్రమోషన్‌లో భాగంగా టెలికాం వినియోగదారులకు ఫోన్‌కాల్స్, మెసేజ్‌లను పంపిస్తు వారిని విసిగిస్తుంటాయి.

Update: 2023-03-28 17:23 GMT

దిశ, వెబ్‌డెస్క్: వివిధ కంపెనీలు తమ ఉత్పత్తులకు సంబంధించి ప్రమోషన్‌లో భాగంగా టెలికాం వినియోగదారులకు ఫోన్‌కాల్స్, మెసేజ్‌లను పంపిస్తు వారిని విసిగిస్తుంటాయి. వీటిని కట్టడి చేయడానికి టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ పలు చర్యలు తీసుకుంది. కానీ ఇప్పటికి కూడా వివిధ కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రమోట్ చేయడానికి వినియోగదారులకు మెసేజ్‌లు, కాల్స్ చేస్తున్నాయి. అయితే ఈ విషయంపై ట్రాయ్ టెలికాం సంస్థలైన జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా కంపెనీల అధికారులతో సమీక్ష నిర్వహించింది. వినియోగదారులను ఇబ్బందులకు గురిచేసే కాల్స్, మెసేజ్‌లను కట్టడి చేయాలని, వీటి కారణంగా స్కామ్‌లు, మోసాలు జరిగే అవకాశం ఉందని, కాబట్టి, అనధికార కాల్స్, సందేశాల పట్ల కంపెనీలు జాగ్రత్త వహించి, వీటిని నియంత్రించాలని టెలికాం దిగ్గజాలకు ట్రాయ్ ఆదేశాలు జారీ చేసింది.

Tags:    

Similar News