Gold and silver rates today : నేడు స్థిరంగా బంగారం, వెండి ధరలు
ప్రపంచంలో బంగారానికి ఉన్న డిమాండ్ దేనికీ ఉండదు. చాలా మంది బంగారాన్ని ఎంతో ఇష్టంగా కొనుక్కుంటారు. ముఖ్యంగా మహిళలకు బంగారం అంటే చాలా ఇష్టం ఉంటుంది. అందుకే ఏ చిన్న శుభకార్యం జరిగినా
దిశ, వెబ్‌డెస్క్ : ప్రపంచంలో బంగారానికి ఉన్న డిమాండ్ దేనికీ ఉండదు. చాలా మంది బంగారాన్ని ఎంతో ఇష్టంగా కొనుక్కుంటారు. ముఖ్యంగా మహిళలకు బంగారం అంటే చాలా ఇష్టం ఉంటుంది. అందుకే ఏ చిన్న శుభకార్యం జరిగినా సరే బంగారం కొనుగోలు చేయాలనుకుంటారు. ఇక గత రెండు మూడు రోజుల నుంచి బంగారం ధరలు పెరుగుతున్న విషయం తెలిసిందే. కాగా, ఈరోజు(శుక్రవారం) గోల్డ్ రేట్స్ స్థిరంగా నమోదయ్యాయి.
హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరల వివరాల్లోకి వెళ్లితే.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.61,040గా ఉండగా,10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,950గా ఉంది.ఇక వెండి ధరలు స్థిరంగానే నమోదు అయ్యాయి. దీంతో కేజీ వెండి రూ. 80, 200 గా నమోదు అయింది.