Today Silver Rates: మహిళలకు షాకింగ్ న్యూస్.. నేడు పెరిగిన వెండి ధరలు
మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం(Gold) కానీ వెండి(Silver) కానీ కొనుగోలు చేస్తుంటాము.
దిశ, వెబ్ డెస్క్ : మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం(Gold) కానీ వెండి(Silver) కానీ కొనుగోలు చేస్తుంటాము. అయితే, గత వారం నుంచి ఈ ధరలు పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు. ఇక వెండి కొనాలనుకునే వారికి ఇది పెద్ద షాకింగ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఎన్నడూ లేని విధంగా నిన్న ఒక్క రోజులోనే వెండి ధరలు భారీగా పెరిగి అందరిని షాక్‌కు గురి చేసింది. అలాగే ఈ రోజు కూడా సిల్వర్ రేట్ స్వల్పంగా పెరిగింది. మరి నిన్నటి కంటే ఈ రోజు ఎంత పెరిగిందో ఇక్కడ చూద్దాం..
ఈ మధ్య కాలంలో వెండి ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఈ రోజు ధరలు స్వల్పంగా పెరిగాయి. నిన్నటి ధరల మీద పోల్చుకుంటే వెండి ధరలు ఈ రోజు రూ. 100 కు పెరిగి కిలో రూ. 1,01,100 గా ఉంది. దీంతో మహిళలు, పసిడి ప్రియులు ఏ వస్తువు కొనకుండానే బయటకు వచ్చేస్తున్నారు.