పోస్టాఫీసులో అకౌంట్ ఉందా.. అయితే ఖచ్చితంగా ఈ సర్వీస్ చార్జీల గురించి తెలుసుకోవాల్సిందే!
దేశవ్యాప్తంగా ఎంతో ఆధరణ కలిగిన సేవింగ్స్ పథకాలలో పోస్టాఫీసు అందించే స్కీమ్‌లు ముందు వరుసలో ఉంటాయి.
దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా ఎంతో ఆధరణ కలిగిన సేవింగ్స్ పథకాలలో పోస్టాఫీసు అందించే స్కీమ్‌లు ముందు వరుసలో ఉంటాయి. ముఖ్యంగా తక్కువ ఆదాయం గల వారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. చాలా రకాల పొదుపు పథకాలు ప్రభుత్వ ఆధ్వర్యంలోని పోస్టాఫీసులు అందిస్తున్నాయి. దీనిలో పెట్టిన పెట్టుబడులు సురక్షితంగా ఉండటమే కాకుండా, భారీగా లాభాలు కూడా పొందవచ్చు. బ్యాంకుల కంటే ఎక్కువ వడ్డీ రేట్లను అందిస్తూ వినియోగదారులకు మంచి ఆదాయాన్ని అందిస్తున్నాయి.
పోస్టాఫీసు ఖాతా ఓపెనింగ్:
పోస్టాఫీసులో ఖాతాను భారతీయ పౌరులు ఎవరైనా ఓపెన్ చేయవచ్చు. ఆధార్ కార్డు, పాన్ కార్డు తీసుకుని దగ్గరలోని ఏదైనా పోస్టాఫీసు బ్రాంచ్‌లో రూ. 500 చెల్లించి అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. బ్యాంకుల మాదిరిగానే ప్రస్తుతం ATM కార్డు, చెక్ బుక్, అకౌంట్ ట్రాన్స్‌ఫర్, అకౌంట్ స్టేట్‌మెంట్ మొదలగునవి కూడా అందిస్తారు. అలాగే పొదుపు ఖాతాలో జమ చేసే డబ్బులపై వడ్డీ లభిస్తుంది. ముఖ్యంగా ఖాతాలో మినిమం బ్యాలెన్స్ ఖచ్చితంగా మెయింటనెన్స్ చేయాలి. లేకపోతే రూ. 50 అకౌంట్ నుంచి డిడక్ట్ చేస్తారు.
అలాగే పోస్టాఫీసుల్లో వివిధ రకాల సేవలు పొందడానికి వివిధ చార్జీలు ఉంటాయి. ముఖ్యమైన చార్జీల గురించి కొన్ని మీకోసం..
1. పాస్‌బుక్ పోగొట్టుకుంటే డూప్లికేట్ పాస్ బుక్ పొందొచ్చు. దీని కోసం రూ.50 చెల్లించాల్సి ఉంటుంది.
2. అకౌంట్ స్టేట్‌మెంట్‌కు రూ. 20 చెల్లించాలి. ఎన్నిసార్లు స్టేట్‌మెంట్ తీసుకుంటే అన్ని రూ. 20 చెల్లించాలి.
3. అకౌంట్ నామినీని మార్చుకోవాలనుకుంటే రూ.50 చెల్లించాలి.
4. అకౌంట్ ట్రాన్స్‌ఫర్ కోసం రూ.100 అవుతుంది.
5. సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ పేరుపై ఉచితంగా చెక్ బుక్. ఏడాదిలో 10 చెక్స్ వరకు ఎలాంటి ఫీజు ఉండదు. ఈ లిమిట్ దాటితే ఒక చెక్‌కు రూ. 2 చెల్లించాలి.
6. సర్టిఫికెట్లను పోగొట్టుకుంటే తిరిగి పొందేందుకు రూ.10 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి.
7. ఖాతాను తాకట్టు పెట్టవచ్చు. దీనికి రూ. 100 చెల్లించాలి.
8. చెక్ బౌన్స్ లేదా క్యాన్సిల్ అయిన రూ. 100 చార్జ్ విధిస్తారు.
ప్రస్తుత కాలంలో బ్యాంకుల కన్నా పోస్టాఫీసుల్లోనే ఎక్కువ వడ్డీ ఉంది. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు ఇంకా ఎక్కువ వడ్డీ లభిస్తుంది. బ్యాంకుల సేవల మాదిరిగానే పోస్టాఫీసులో కూడా ఏటీఎం, క్యాత్ విత్ డ్రా, ఆన్‌లైన్ మనీ ట్రాన్స్‌ఫర్ సేవలు అందుబాటులో ఉన్నాయి. సీనియర్ సిటిజన్లకు వారు చేసిన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అధికంగా వడ్డీ లభిస్తుంది. ఒక లక్ష రూపాయాలకు గాను నెలకు రూ. 630 పైగా వడ్డీ వస్తుంది.
మహిళల కోసం వారు చేసే పెట్టుబడులపై ఎక్కువ వడ్డీని అందించేలా ఇటీవల కేంద్రం మహిళా సమ్మాన్ యోజనను లాంచ్ చేసింది. వీటితో పాటు ఇప్పటికే నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్, ఆడ పిల్లల కోసం సుకన్య సమృద్ధి యోజన మొదలగు పొదుపు పథకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. వీటి గురించిన పూర్తి సమాచారం కోసం దగ్గరలోని పోస్టాఫీసు బ్రాంచ్‌లో సంప్రదించగలరు.
Also Read...
క్రెడిట్ కార్డును యూపీఐకి లింక్ చేసుకునే సదుపాయం ప్రారంభించిన HDFC!