సీనియర్ సిటిజన్‌లకు వివిధ బ్యాంకులు అందించే అధిక వడ్డీరేట్లు ఇవే!
ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడానికి ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వరుసగా రెపో రేటును పెంచిన సంగతి తెలిసిందే.
దిశ, వెబ్‌డెస్క్: ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడానికి ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వరుసగా రెపో రేటును పెంచిన సంగతి తెలిసిందే. దీంతో పలు బ్యాంకులు కూడా తమ వినియోగదారులు చేసుకునే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచాయి. సాధారణ ప్రజల నుంచి మొదలుకుని సీనియర్ సిటిజన్ల వరకు వివిధ బ్యాంకులు వివిధ వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు మరింత ఎక్కువ వడ్డీ రేటును ఆఫర్ చేస్తున్నాయి.
అయితే ఏ ఏ బ్యాంకులు సీనియర్ సిటిజన్లు ఎంత వడ్డీ రేటును ఆఫర్ చేస్తున్నాయో, ఒకసారి చూద్దాం..
ICICI బ్యాంక్: 5 నుండి 10 సంవత్సరాల వరకు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్‌లకు 7.50 శాతం వడ్డీ రేటును అందిస్తోంది.
SBI బ్యాంక్: సాధారణంగా 5 నుండి 10 సంవత్సరాల మధ్య ఫిక్స్‌డ్ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్‌లకు 7.5 శాతం వడ్డీ రేటు ఉంది, అదే అమృత్ కలాష్ పథకం కింద ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసినట్లయితే వారికి 7.60 శాతం వడ్డీని అందిస్తోంది.
HDFC బ్యాంక్: సీనియర్ సిటిజన్ కేర్ పథకం కింద 5 నుండి 10 సంవత్సరాల కాలానికి 7.75 శాతం వడ్డీ రేటు లభిస్తుంది.
IDBI బ్యాంక్: 1 నుండి 2 సంవత్సరాల మధ్య ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసే సీనియర్ సిటిజన్లు 7.50 శాతం వడ్డీ రేటును పొందవచ్చు. అదే 2 నుండి 3 సంవత్సరాల మధ్య ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 7.25 శాతంగా ఉంది.
ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్: 1001 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్‌లకు 8.75 శాతం వడ్డీని అందిస్తోంది.
బంధన్ బ్యాంక్: 600 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 8.50 శాతం వడ్డీ రేటును అందిస్తోంది.
యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్: 1001 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్‌లకు అత్యధికంగా 9.50 శాతం వడ్డీ రేటును అందిస్తోంది.
సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్: సీనియర్ సిటిజన్‌లకు 1001 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 8.76 శాతం వడ్డీని అందిస్తోంది.