బ్లూస్టోన్‌‌లో $100 మిలియన్ పెట్టుబడి పెట్టనున్న Temasek

రతన్ టాటా మద్దతు గల బెంగళూరుకు చెందిన ఆభరణాల కంపెనీ బ్లూస్టోన్‌‌లో $100 మిలియన్ పెట్టుబడి పెట్టాలని సింగపూర్ స్టేట్ ఇన్వెస్టర్ Temasek ఆలోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

Update: 2023-05-06 09:24 GMT

బెంగళూరు: రతన్ టాటా మద్దతు గల బెంగళూరుకు చెందిన ఆభరణాల కంపెనీ బ్లూస్టోన్‌‌లో $100 మిలియన్ పెట్టుబడి పెట్టాలని సింగపూర్ స్టేట్ ఇన్వెస్టర్ Temasek ఆలోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ పెట్టుబడి ద్వారా బ్లూస్టోన్‌‌లో సుమారు 20% వాటా ఆ కంపెనీకి సొంతం కానుంది. తరువాత, క్రమంగా ఈ పెట్టుబడి $500 మిలియన్లకు చేరుకుంటుందని సమాచారం.

కరోనా మహమ్మారి తర్వాత క్రమంగా ఆభరణాలకు డిమాండ్ పెరుగుతుంది. చైనా తర్వాత ఇండియా రెండవ అతిపెద్ద ఆభరణాలను వినియోగించే దేశంగా ఉంది. బ్లూస్టోన్ స్టోర్లను విస్తరించడానికి ఇదే సరైన సమయం, ఈ ఒప్పందం ద్వారా భారత్ మార్కెట్లో ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ వ్యాపారం పుంజుకుంటుందని బ్లూస్టోన్ వర్గాలు పేర్కొన్నాయి. అన్ని చర్చలు సఫలమైతే జులై-సెప్టెంబర్ నాటికి డీల్ కుదుర్చుకోవచ్చని సమాచారం. బ్లూస్టోన్ 2024 నాటికి 300 స్టోర్లను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఈ ఒప్పందం గురించి Temasek ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

Tags:    

Similar News