Tech Mahindra Q2 Results: రెండో త్రైమాసికంలో అదరగొట్టిన టెక్ మహీంద్రా.. 153 శాతం పెరిగిన లాభం..!

భారతదేశం(India)లోని దిగ్గజ టెక్ కంపెనీల్లో ఒకటైన టెక్ మహీంద్రా(Tech Mahindra) శనివారం జులై-సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాల(July-September Quarter Results)ను ప్రకటించింది.

Update: 2024-10-19 10:22 GMT

దిశ, వెబ్‌డెస్క్: భారతదేశం(India)లోని దిగ్గజ టెక్ కంపెనీల్లో ఒకటైన టెక్ మహీంద్రా(Tech Mahindra) శనివారం జులై-సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాల(July-September Quarter Results)ను ప్రకటించింది. ఈ త్రైమాసికంలో ఆ సంస్ధ లాభాల్లో అదరగొట్టింది. సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికం(Q2FY25)లో సంస్థ లాభం 153.1 శాతం పెరిగి రూ.1,250 కోట్ల నికర లాభాన్ని(Net profit) నమోదు చేసినట్లు టెక్ మహీంద్రా ప్రకటించింది. ఇక ఇది అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2023-24) ఇదే సమయంతో పోలిస్తే నికర లాభం రూ.493.9 కోట్లుగా ఉంది. ఇక కంపెనీ కార్యకలాపాల ఆదాయం రూ.13,313 కోట్లుగా నమోదైనట్లు తెలిపింది. గతేడాది ఇదే సమయంలో కంపెనీ ఆదాయం రూ. 12,863.9 కోట్లుగా ఉండగా.. ఈసారి అది 3.49 శాతం వృద్ధి(Growth) చెందింది.

ఈ త్రైమాసికంలో భారీగా లాభాలను ఆర్జించిన సందర్భంగా టెక్ మహీంద్రా తన ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. అర్హులైన షేర్ హోల్డర్లకు ఒక్కో షేరుకు రూ. 15 చొప్పున మధ్యంతర డివిడెంట్(Interim Dividend) చెల్లించాలని నిర్ణయించింది. దీనికి రికార్డు తేదీని కంపెనీ అధికారంగా ఇంకా ప్రకటించలేదు. ఇక రాబోయే మూడో క్వార్టర్(Third Quarter)లో కూడా కంపెనీ మెరుగైన వృద్ధి రేటు నమోదు చేయనున్నట్లు సీఈఓ మోహిత్ జోషీ(CEO Mohit Joshi) ధీమా వ్యక్తం చేశారు. ఇక ఈ త్రైమాసికంలో పుణె(Pune)లోని ప్రధాన కార్యాలయంలో కొత్తగా 6,653 మంది ఉద్యోగుల్ని నియమించుకున్నామని, టెక్ మహీంద్రాలో ప్రస్తుతం 1,54,273 మంది సిబ్బంది ఉన్నారని ఆయన తెలిపారు.


Similar News