వాణిజ్య వాహనాల ధరలను 2 శాతం పెంచిన టాటా మోటార్స్!
కొత్త ఏడాది జనవరి నుంచి అన్ని వాణిజ్య వాహనాల ధరలను పెంచుతున్నట్టు టాటా మోటార్స్ మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించింది.
న్యూఢిల్లీ: కొత్త ఏడాది జనవరి నుంచి అన్ని వాణిజ్య వాహనాల ధరలను పెంచుతున్నట్టు టాటా మోటార్స్ మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ధరల పెంపు 2 శాతం వరకు ఉంటుందని పేర్కొంది. ఈ పెంపు వాహనం మోడల్, వేరియంట్‌ని వేర్వేరుగా ఉంటుందని, కంపెనీ పోర్ట్‌ఫోలియోలోని అన్ని వాహనాలకు పెంపు వర్తిస్తుందని టాటా మోటార్స్ స్పష్టం చేసింది. వాహనాల తయారీలో ఖర్చులు గణనీయంగా పెరిగాయని, ఇన్‌పుట్ ఖర్చుల భారాన్ని అధిగమించేందుకు కొంత భాగం వినియోగదారులకు బదిలీ చేయాలని నిర్ణయించినట్టు కంపెనీ వివరించింది. దేశీయ వాహన పరిశ్రమలో ఇప్పటికే పలు ప్యాసింజర్ వాహనాల తయారీ కంపెనీలు జనవరి నుంచి ధరల పెంపును ప్రకటించాయి. అందులో మారుతీ సుజుకి, కియా ఇండియా, హీరో మోటోకార్ప్‌తో పాటు ఆడి వంటి లగ్జరీ కార్ల కంపెనీలు ఉన్నాయి. క్రమంగా పెరుగుతున్న ఖర్చుల తగ్గింపులో భాగంగానే వాహనాల ధరల పెంపు నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీలు పేర్కొన్నాయి.