కమర్షియల్ వాహనాల ధరలను 5 శాతం పెంచిన టాటా మోటార్స్!

దేశీయ అతిపెద్ద వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ తన కమర్షియల్ వాహనాల ధరలను పెంచుతున్నట్టు మంగళవారం ప్రకటించింది.

Update: 2023-03-21 16:28 GMT

న్యూఢిల్లీ: దేశీయ అతిపెద్ద వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ తన కమర్షియల్ వాహనాల ధరలను పెంచుతున్నట్టు మంగళవారం ప్రకటించింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్న బీఎస్6 ఫేజ్ 2 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా ధరలను 5 శాతం మేర పెంచుతున్నామని, అన్ని కమర్షియల్ వాహనాలకు ఇది వర్తిస్తుందని ఓ ప్రకటనలో తెలిపింది.

వాహనం మోడల్, వేరియంట్‌ని బట్టి ధరల పెరుగుదలలో వ్యత్యాసం ఉంటుంది. అదేవిధంగా కొత్త ఉద్గార నిబంధనలకు అనుగుణంగా వాహనాలను అప్‌గ్రేడ్ చేస్తున్నామని, తద్వారా పెరిగిన వ్యయాన్ని దృష్టిలో ఉంచుకుని ధరలను పెంచినట్టు కంపెనీ తెలిపింది. ఫేజ్ 2 ఉద్గార నిబంధనల ద్వారా వినియోగదారులు ఎక్కువ ప్రయోజనాలు పొందనున్నారు.

తక్కువ ఖర్చుతో క్లీన్, గ్రీన్, టెక్నాలజీ పరంగా మెరుగైన ఫీచర్లను కలిగి ఉంటారని కంపెనీ పేర్కొంది. రియల్‌ డ్రైవింగ్‌ ఎమిషన్‌(ఆర్‌డీఈ) కొత్త ఉద్గార నిబంధనల ప్రకారం ప్యాసింజర్‌, కమర్షియల్ వాహనాల్లో ఎప్పటికప్పుడు వాహన ఉద్గార స్థాయులను కొలిచే విధానం ఉండాలి.

Tags:    

Similar News