Swiggy IPO: క్యూఐబీల నుంచి అదిరిపోయే రెస్పాన్స్.. స్విగ్గీ ఐపీఓకు 3.59 రేట్ల సబ్‌స్క్రిప్షన్‌..!

ప్రముఖ ఆన్‌లైన్‌ ఫుడ్ డెలివరీ(Online Food Delivery) అండ్ క్విక్ కామర్స్(Quick Commerce) సంస్థ ‘స్విగ్గీ(Swiggy)’ ఐపీఓ బిడ్డింగ్ ప్రక్రియ(IPO Bidding Process) ఈ రోజు ముగిసింది.

Update: 2024-11-08 15:46 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఆన్‌లైన్‌ ఫుడ్ డెలివరీ(Online Food Delivery) అండ్ క్విక్ కామర్స్(Quick Commerce) సంస్థ ‘స్విగ్గీ(Swiggy)’ ఐపీఓ బిడ్డింగ్ ప్రక్రియ(IPO Bidding Process) ఈ రోజు ముగిసింది. తొలి రెండు రోజులు స్విగ్గీ ఐపీఓకు నామమాత్రమైన స్పందన రాగా.. చివరిరోజైన శుక్రవారం మాత్రం అదిరిపోయే స్పందన లభించింది. కాగా స్విగ్గీ సంస్థ ఐపీఓ ద్వారా సుమారు రూ. 11,300 కోట్లను సమీకరించాలనే లక్ష్యంతో మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వగా మొత్తం 3.59 రేట్ల సబ్‌స్క్రిప్షన్‌ అందుకుంది. ఎన్ఎస్ఈ(NSE) వెల్లడించిన డేటా ప్రకారం 16 కోట్ల షేర్లకు 57.53 కోట్ల షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల నుంచి 6.2 రేట్లు సబ్‌స్క్రిప్షన్లు రాగా.. రిటైల్ ఇన్వెస్టర్ల కోటా 1.14 రేట్ల సబ్‌స్క్రిప్షన్‌ అందుకుంది. ఇక నాన్ ఇన్ స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు 41 శాతం మాత్రమే బిడ్లు దాఖలు చేశారు. మరోవైపు యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.5,085 కోట్ల నిధులు సేకరించినట్లు స్విగ్గీ ఇదివరకే వెల్లడించిన విషయం తెలిసిందే. కాగా కోటక్ మహీంద్రా క్యాపిటల్ కంపెనీ, జేపీ మోర్గాన్ ఇండియా, సిటీ గ్రూప్ గ్లోబల్ మార్కెట్స్ ఇండియా లాంటి తదితర కంపెనీలు స్విగ్గీ ఐపీఓ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి.

Tags:    

Similar News