Gold River: ఇండియాలో నీటితోపాటు బంగారం ప్రవహించే నది.. అక్కడికి వెళ్తే ధనవంతులు అవ్వడం పక్కా
Gold River: మనదేశంలో వందలాది నదులు ప్రవహిస్తున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: Gold River: మనదేశంలో వందలాది నదులు ప్రవహిస్తున్నాయి. అందులో జీవ నదులు కూడా ఉన్నాయి. ఈ నదులే ప్రజలకు జీవనాధారం. కానీ నీటితోపాటు బంగారం ప్రవహించే నది ఉందని మీకు తెలిస్తే షాక్ అవ్వడం పక్కా. ఆ నది ఎక్కడుందో తెలుసుకుందాం.
భారతదేశంలో అనేక నదులు ఉన్నాయి. గంగా, యమునా, సింధు, జీలం, క్రిష్ణ, గోదావరి, కావేరి, గోమతి, మహానది, నర్మదా, సరయు, బ్రహ్మపుత్ర ఇలా ఎన్నో ఉన్నాయి. వాటికి వందలాది ఉపనదులు కూడా ఉన్నాయి. అయితే నీటితో బంగారం ప్రవహించే నది ఉందని మీకు తెలుసా? బంగారం ప్రవహించడం ఏంటని మీరు షాక్ అవుతున్నారా. అవును నిజమే నీటితోపాటు బంగారం ప్రవహించే నది జార్ఖండ్ రాష్ట్రంలో ఉంది. ఈ నది పేరు సువర్ణరేఖ. కొంతమంది స్వర్ణరేఖ అని పిలుస్తారు. ఈ నదిలో పేరులోనే ఉంది స్వర్ణ అని. స్వర్ణ అంటే బంగారం. ఈ నది జార్ఖండ్ నుంచి పశ్చిమ బెంగాల్ గుండా ఒడిశా వరకు ప్రవహిస్తుంది.
ఈ నది జార్ఖండ్ రాజధాని రాంచీ నుంచి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న చోటా నాగ్ పూర్ పీఠభూమిపై ఉన్న నాగ్ డి గ్రామంలో ఒక బావి నుంచి ఉద్భవించింది. స్వర్ణరేఖ నదిలో బంగారం ఎక్కడి నుంచి వస్తుందనే ఇప్పటివరకు అంతుచిక్కని రహస్యం. అయితే ఈ నది చుట్టుపక్కల నివసిస్తున్న గ్రామాల ప్రజలు ఈ నదిలో నుంచి బంగారాన్ని వెలికితీస్తున్నారు. వీరికి తరతరాల నుంచి ఈ నదే జీవనాధారంగా మారింది. ఈ నదిలో నుంచి బంగారాన్ని వెలికితీసి డబ్బు సంపాదిస్తున్నారు. ఇక్కడి పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఈ నదిలో బంగారం వేటలోనే ఉంటారు.
అయితే వందేళ్ల తర్వాత కూడా ఈ నదిలో బంగారం ఎందుకు ప్రవహిస్తుందో గుర్తించలేకపోతున్నారు శాస్త్రవేత్తలు. ఈ నదిలో బంగారం ఎక్కడి నుంచి వస్తుందనేది ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. ఈ నది రాళ్ల గుండా ప్రవహిస్తుందని ..అందుకే బంగారు రేణువులు అందులో నుంచి వస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నప్పటికీ దీనిపై ఎలాంటి ధ్రువీకరణ లేదు. అయితే ఈ నదికి మరో ప్రత్యేకత ఉంది. అదేంటంటే జార్ఖండ్ నుంచి ప్రవహించే ఈ నది మరే ఇతర నదుల్లో కలవకుండా నేరుగా బంగాళాఖాతంలోనే కలుస్తుంది.