అదానీ గ్రూప్‌పై ఆరోపణల దర్యాప్తునకు సెబీకి గడువు పొడిగింపు!

అదానీ గ్రూప్‌పై అమెరికాకు చెందిన షార్ట్‌సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలపై దర్యాప్తును పూర్తి చేసేందుకు సెబీకి సుప్రీంకోర్టు మూడు నెలల గడువు పొడిగింపును మంజూరు చేసింది

Update: 2023-05-17 11:00 GMT

న్యూఢిల్లీ: అదానీ గ్రూప్‌పై అమెరికాకు చెందిన షార్ట్‌సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలపై దర్యాప్తును పూర్తి చేసేందుకు సెబీకి సుప్రీంకోర్టు మూడు నెలల గడువు పొడిగింపును మంజూరు చేసింది. ఈ మేరకు బుధవారం అత్యున్నత న్యాయస్థానం జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహా, జస్టిస్ పార్దివాలాతో కూడిన ధర్మాసనం నిరవధిక పొడిగింపు ఇవ్వలేమని పేర్కొంది.

ఇదివరకు మే 2 లోగా నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు కోరగా, మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) ఆరు నెలల పొడిగింపును అడిగింది. ఇప్పటికే రెండు నెలల గడువు ఇచ్చాం. ఇప్పుడు మళ్లీ ఆగస్టు వరకు పొడిగించాం. ఈ ఏడాది జనవరిలో అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ చేసిన ఆరోపణలతో, కంపెనీ షేర్ల విలువ భారీగా క్షీణించింది. ఈ నేపథ్యంలో షేర్ల అవకతవకలపై రెండు నెలల్లోగా విచారణ జరిపి నివేదిక సమర్పించాలని సెబీని సుప్రీం కోర్టు మార్చి 2న ఆదేశించిన సంగతి తెలిసిందే.

Also Read..

ఫ్యూచర్ రిటైల్ కొనుగోలు రేసు నుంచి తప్పుకున్న రిలయన్స్, అదానీ కంపెనీలు!

Tags:    

Similar News