Stock Markets: స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock Markets) గురువారం స్వల్ప లాభాలతో గట్టెక్కాయి.
దిశ, వెబ్‌డెస్క్:దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock Markets) గురువారం స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. ఈ రోజు ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు చివరి వరకు అలానే కొనసాగాయి. గ్లోబల్ మార్కెట్(Global Market)లో సానుకూల సంకేతాలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్(U.S Federal Reserve) రాబోయే రోజుల్లో వడ్డీ రేట్లు మరింత తగ్గిస్తుందన్న అంచనాల నేపథ్యంలో ఆసియా మార్కెట్లు సహా మన సూచీలు రాణించాయి. ఇంట్రాడేలో 82,002.84 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకిన సెన్సెక్స్(Sensex) చివరికి 140.75 పాయింట్ల లాభంతో 81,607.55 వద్ద స్థిరపడింది. ఇక నిఫ్టీ(Nifty) 16.50 పాయింట్ల లాభంతో 24,998.45 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 77.71 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.97గా ఉంది.
లాభాలో ముగిసిన షేర్లు : కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్,జేఎస్‌డబ్ల్యూ స్టీల్ , ఇండస్ ఇండ్ బ్యాంక్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్
నష్టపోయిన షేర్లు : టాటా మోటార్స్, టైటాన్, టెక్ మహీంద్రా, సన్ ఫార్మా, ఇన్ఫోసిస్