Stock Market: వరుసగా ఆరో రోజు నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

పశ్చిమాసియాలో చోటు చేసుకున్న ఉద్రిక్తత పరిస్థితుల కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock Markets) గత ఐదు రోజులుగా నష్టాల్లో ముగుస్తున్న విషయం తెలిసిందే.

Update: 2024-10-07 13:58 GMT

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమాసియాలో చోటు చేసుకున్న ఉద్రిక్తత పరిస్థితుల కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్లు(Stock Markets) గత ఐదు రోజులుగా నష్టాల్లో ముగుస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆరు రోజు కూడా స్టాక్ మార్కెట్లు నష్టాలు చవిచూశాయి.ఈ రోజు ఉదయం సూచీలు లాభాల్లో ట్రేడ్ అవ్వగా ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలు పెరగడం వల్ల సాయంత్రం అయ్యేసరికి పతనమయ్యాయి. సెన్సెక్స్(Sensex) 638.45 పాయింట్లు నష్టపోయి 81,050 పాయింట్ల వద్ద స్థిర పడింది.ఇక నిఫ్టీ(Nifty) 218 పాయింట్లు కోల్పోయి 24,795.75 వద్ద ముగిసింది. ముఖ్యంగా హెచ్‌డీఎఫ్‌సీ, రిలయన్స్‌ షేర్లు అమ్మకాలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ప్రస్తుతం అమెరికన్​ డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.99గా ఉంది.

లాభాల్లో ముగిసిన స్టాక్స్: ఐటీసీ, భారతీ ఎయిర్ టెల్, మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహీంద్రా

నష్టాలు చవిచూసిన స్టాక్స్: అదానీ పోర్ట్స్, ఎన్టీపీసీ,స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కోల్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్ 


Similar News