PSBs: బ్యాకింగ్ సేవల కోసం మొదటిసారి అప్రెంటిస్‌లను తీసుకుంటున్న పీఎస్‌బీలు

సెమీ-అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో కస్టమర్లతో సంబంధాలను మెరుగుపరిచేందుకు అప్రెంటీస్‌షిప్ ప్రోగ్రామ్‌ను తీసుకొస్తున్నాయి

Update: 2024-09-29 14:00 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ రంగ బ్యాంకులు వినియోగదారులకు అందించే సేవలను మరింత పెంచేందుకు కీలక నిర్ణయాలు తీసుకోనున్నాయి. ముఖ్యంగా సెమీ-అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో కస్టమర్లతో సంబంధాలను మెరుగుపరిచేందుకు అప్రెంటీస్‌షిప్ ప్రోగ్రామ్‌ను తీసుకురావాలని భావిస్తున్నాయి. ఈ విధంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు(పీఎస్‌బీ) అప్రెంటీస్‌లను నియమించుకోవడం ఇదే మొదటిసారి. గత కొన్నేళ్ల నుంచి బ్యాంకింగ్ రంగంలో తగ్గుతున్న శ్రామికశక్తిని దృష్టిలో ఉంచుకుని బ్యాంకులు ఈ కార్యక్రమాన్ని పరిశీలిస్తున్నాయి. ఇటీవల యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 500, కెనరా బ్యాంక్ 3,000, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 550 మందిని ఏడాదిపాటు అప్రెంటీస్‌షిప్ ప్రోగ్రామ్ కింద రిక్రూట్ చేసుకున్నాయి. వారికి నెలకు రూ. 15,000 చొప్పున స్టైఫండ్ ఇవ్వనున్నాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియా సైతం 1,300 మంది అప్రెంటీస్‌లను తీసుకునేందుకు బ్యాంక్ బోర్డు ఆమోదం పొందింది. ఈ నియామకాలన్నీ ప్రధానంగా కస్టమర్ రిలేషన్స్ వంటి విభాగాల్లో పనిచేయనున్నారు. అప్రెంటీస్‌గా నియమించబడిన వారు సెబీ-అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లోని బ్యాంకు బ్రాంచుల్లో కస్టమర్ సంబంధాలను పెంచేందుకు పనిచేస్తారు. ఖాతాదారుల అవసరాలను అర్థం చేసుకుని, వారిని మెరుగైన సేవలందించేలా పనిచేస్తారని కెనరా బ్యాంక్ సీఈఓ కె సత్యనారాయణ రాజు అన్నారు.  

Tags:    

Similar News