సబ్బుల, డిటర్జెంట్‌లపై భారీ ఆఫర్‌తో పోటీ పెంచిన రిలయన్స్!

ఇటీవల కాంపా కోలాతో సాఫ్ట్‌డ్రింక్ రంగంలో ధరల పోటీని ప్రారంభించిన రిలయన్స్ ఇండస్ట్రీస్ తాజాగా ఎఫ్ఎంసీజీ రంగంలో మరో విభాగంలో ఇదే తరహా నిర్ణయం తీసుకుంది.

Update: 2023-03-26 16:09 GMT

ముంబై: ఇటీవల కాంపా కోలాతో సాఫ్ట్‌డ్రింక్ రంగంలో ధరల పోటీని ప్రారంభించిన రిలయన్స్ ఇండస్ట్రీస్ తాజాగా ఎఫ్ఎంసీజీ రంగంలో మరో విభాగంలో ఇదే తరహా నిర్ణయం తీసుకుంది. తాజాగా రిలయన్స్ ఎఫ్ఎంసీజీ విభాగంలో వ్యక్తిగత, ఇంటి అవసరాలకు వాడే ఉత్పత్తుల్లో భారీ డిస్కౌంట్ ప్రకటించి ఇతర కంపెనీలను కట్టడి చేసే ప్రయత్నం మొదలు పెట్టింది. సాధారణ మార్కెట్ ధర కంటే 30-35 శాతం తక్కువకే నిత్యావసర వస్తువులను విక్రయించడం ప్రారంభించింది. రిలయన్స్ రిటైల్ వెంచర్ వివరాల ప్రకారం, బ్యూటీ, నేచురల్, హైజీన్ సోప్‌లు రూ. 25కే ఇవ్వనుంది.

సబ్బుల విభాగంలో లక్స్ ధర రూ. 35 కంటే ఇది రూ. 10 తక్కువ. డేటాల్, సంతూర్ కన్నా తక్కువే ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అలాగే, లిక్విడ్ డిటర్జెంట్ ధర ఇతర బ్రాండ్లతో పోలిస్తే అతి తక్కువకే రిలయన్స్ మార్కెట్లో ఉత్పత్తులను తీసుకొచ్చింది. ప్రస్తుతానికి ఆయా విభాగాల్లో ఉత్పత్తులు కొన్ని ప్రాంతాలకే పరిమితమైనప్పటికీ భవిష్యత్తులో మరిన్ని ప్రాంతాలకు ఇవే ధరలతో వినియోగదారులకు చేరుస్తామని కంపెనీ పేర్కొంది.

Tags:    

Similar News