Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లో బ్లడ్ బాత్..సెన్సెక్స్ 4000 పాయింట్లు డౌన్
Stock Market: ట్రంప్ టారిఫ్స్ ఎఫెక్ట్ మార్కెట్లను కుదిపేస్తోంది.
దిశ, వెబ్ డెస్క్: Stock Market: ట్రంప్ టారిఫ్స్ ఎఫెక్ట్ మార్కెట్లను కుదిపేస్తోంది. అటు ఆసియా మార్కెట్లు కూడా భారీగా పతనం అవుతున్నాయి. దీంతో దేశీయ సూచీల్లో సోమవారం బ్లడ్ బాత్ కనిపించింది. ఆరంభంలోనే సూచీలు ఒక్కసారిగా కుప్పకూలాయి. సెన్సెక్స్ ఏకంగా 4వేల పాయింట్లు పైగా దిగజారాయి. నిఫ్టీ 22వేల మార్క్ ను కోల్పోయింది. ఇక బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు ఏకంగా 10శాతం వరకు పడిపోయాయి.
భారతీయ స్టాక్ మార్కెట్లు ఇంతలా నష్టపోవడానికి ప్రధానంగా డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొత్త టారిఫ్స్ ను వెనక్కి తీసుకునే అవకాశాలు కనిపించకపోవడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రధాన మార్కెట్లు భారీగా నష్టపోయాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రధాన స్టాక్ మార్కెట్లు నష్టపోవడంపై తాము ఆందోళన చెందడం లేదని ట్రంప్ తెలిపారు.
దీంతో ఆసియా, యూరోప్, అమెరికా స్టాక్ మార్కెట్లలో బ్లడ్ బాత్ కనిపించింది. ఈ రోజు తైవాన్ వెయిటెడ్ ఏకంగా 10శాతం కుప్పకూలగా, నిఫ్టీ7శాతం పతనం అయ్యింది. శుక్రవారంతో ముగిసిన ఎస్ అండ్ పీ 500ఏకంగా సుమారు 6శాతం డౌన్ జోన్స్ 5.5శాతం, టెక్ హెవీ నాస్డాక్ 5.73 శాతం పతనమయ్యాయి. డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన సుంకాలు భారతదేశంపై తక్కువ ప్రభావాన్ని చూపినప్పటికీ 2026 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో మన కంపెనీల ఆదాయాలు సుమారు 3శాతం వరకు తగ్గే ఛాన్స్ ఉంది. దీంతో నిఫ్టీ 21,500పాయింట్లకు తగ్గే అవకాశం ఉందని ప్రముఖ గ్లోబల్ బ్రోకరేజీ కంపెనీలు తెలిపాయి. దీని కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో మన దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల బాట పట్టే ఛాన్స్ ఉంది.