Stock Market: మళ్లీ నష్టాల్లోకి జారిన స్టాక్ మార్కెట్లు

అంతర్జాతీయ మార్కెట్లలో ఒడిదుడుకులతో పాటు దేశీయంగా గరిష్ఠాల వద్ద మదుపర్లు అమ్మకాలకు దిగారు.

Update: 2024-09-11 13:45 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీ మార్కెట్లు మళ్లీ నష్టాలను ఎదుర్కొన్నాయి. గత రెండు సెషన్‌లలో లాభాలను చూసిన సూచీలు బుధవారం ట్రేడింగ్‌లో బలహీనపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ఒడిదుడుకులతో పాటు దేశీయంగా గరిష్ఠాల వద్ద మదుపర్లు అమ్మకాలకు దిగారు. ముఖ్యంగా కీలక కంపెనీల షేర్లలో అమ్మకాలు ఊపందుకున్నాయి. గ్లోబల్ మార్కెట్లకు తోడు ఆసియా మార్కెట్లలోనూ చైనా ఆర్థిక మందగమనం, కమొడిటీ ధరల ప్రభావం, దేశీయంగా ద్రవ్యోల్బణంపై ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించడంతో నష్టాలు తప్పలేదు. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 398.13 పాయింట్లు పతనమై 81,523 వద్ద, నిఫ్టీ 122.65 పాయింట్ల నష్టంతో 24,918 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఎఫ్ఎంసీజీ మినహా మిగిలిన ప్రధాన రంగాలన్నీ కుదేలయ్యాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఏషియన్ పెయింట్, బజాజ్ ఫైనాన్స్, సన్‌ఫార్మా, బజాజ్ ఫిన్‌సర్వ్, హిందూస్తాన్ యూనిలీవర్, ఐటీసీ షేర్లు లాభాలను దక్కించుకున్నాయి. టాటా మోటార్స్, ఎస్‌బీఐ, ఎన్‌టీపీసీ, ఎల్అండ్‌టీ, అదానీ పోర్ట్స్, ఎంఅండ్ఎం స్టాక్స్ అధిక నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.97 వద్ద ఉంది. 

Tags:    

Similar News