SBI Scheme: రూ.5లక్షల పెట్టుబడి.. రాబడి ఎంతో తెలుసుకోండి... ఈ SBI కొత్త స్కీమ్‌తో అధిక వడ్డీ గ్యారెంటీ!
SBI Patrons Scheme: అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) ఈ మధ్యే రెండు కొత్త స్కీములను లాంచ్ చేసిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: SBI Patrons Scheme: అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) ఈ మధ్యే రెండు కొత్త స్కీములను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. దీనిలో ఒకటి ఎస్బిఐ లఖ్ పతి(SBI Lakhpati) రికవరింగ్ డిపాజిట్ స్కీమ్..మరొకటి ప్యాట్రన్స్ స్కీమ్(Patrons Scheme). లఖ్ పతి స్కీములో నెలనెలా కొంత డిపాజిట్ చేస్తే...నిర్దిష్ట సమయానికి రిటర్న్స్ అందుతాయి. ప్యాట్రన్స్ మాత్రం ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్. ఇందులో సూపర్ సీనియర్ సిటిజన్ల(Super senior citizens)కు అధిక వడ్డీ అందుతుంది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
SBI Patrons Scheme: దేశంలోని అతిపెద్ద బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(State Bank of India) కొత్త సంవత్సరంలో రెండు కొత్త పథకాలను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఇందులో ఒకటి సరికొత్త ఫిక్డ్స్ డిపాజిట్ స్కీమ్ ఎస్బిఐ ప్యాట్రన్స్. ఇది కేవల సూపర్ సీనియర్ సిటిజన్లను ఉద్దేశించి లాంచ్ చేసిన స్కీమ్. ఈ ఎస్బిఐ ప్యాట్రన్స్ పథకం కింద ఫిక్స్డ్ డిపాజిట్(Fixed Deposit) ఇన్వెస్ట్ మెంట్లపై సీనియర్ సిటిజన్లకు వచ్చే దానికంటే అధిక వడ్డీ వస్తుందని చెప్పవచ్చు. 80ఏళ్లు, ఆ పైబడిన భారత నివాసితులు ఎవరైనా ఈ స్కీములో చేరవచ్చు. ఈ స్కీము కింద కనీసం రూ. 1000 జమ చేసేందుకు వీలుంటుంది. గరిష్టంగా రూ. 3కోట్ల వరకు డిపాజిట్ చేయాలి.
ఈ స్కీములో సింగిల్ లేదంటే జాయింట్(Single or joint) గా ఖాతా తీసుకోవచ్చు. జాయింట్ అకౌంట్ కింద అయితే ప్రైమరీ అకౌంట్ హోల్డర్ కచ్చితంగా 80ఏళ్లు లేదా ఆపైబడి ఉండాలి. ప్రీమెచ్యూర్ విత్ డ్రాయల్ కు అవకాశం ఉంటుంది. ఇక్కడ వడ్డీ రేట్లలో కాస్త కోత ఉంటుంది. ఇక్కడ ఫిక్స్డ్ డిపాజిట్ల మాదిరిగానే టెన్యూర్స్ కూడా ఉంటాయి. ఇక్కడ సూపర్ సీనియర్ సిటిజెన్లు ఎస్బిఐ ప్యాట్రన్స్ స్కీమ్ గురించి ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సని అవసరం ఉండదు. ఫిక్స్డ్ డిపాజిట్లు సాధారణంగా చేసే సమయంలోనే 80ఏళ్లు, ఆ పైబడి ఉంటే ఈ స్కీమ్ కింద అత్యధిక వడ్డీ రేట్లే వర్తిస్తాయి. వారు పుట్టిన తేదీబట్టి ఇది ఆటోమెటిగ్గా తీసుకుంటుందని చెప్పవచ్చు.
ప్రస్తుతం సీనియర్ సిటిజెన్లకు ఎస్బిఐలో ఉన్న వడ్డీ రేట్లపై అదనంగా 10 బేసిస్ పాయింట్స్ మేర వడ్డీ కూడా అందుతుంది. 10 బేసిస్ పాయింట్స్ అంటే 0.10 శాతం. 100 బేసిస్ పాయింట్స్ ను ఒక శాతంగా పరిగణిస్తారు. సూపర్ సీనియర్ సిటిజెన్లకు దీని ప్రకారం ఇప్పుడు 4.10 శాతం నుంచి 7.60శాతం వరకు వడ్దీ రేట్లు ఉన్నాయి. ఏడాది డిపాజిట్ పై 7.40శాతం రెండేళ్ల డిపాజిట్లపై అత్యధికంగా వీరికి 7.60శాతం వడ్డీ రేట్లు ఉన్నాయి.
ఈక్రమంలోనే ఈ స్కీములో 5లక్షలు జమ చేస్తే ఏడాదికి 7.40శాతం వడ్డీ రేటు కింద రూ. 34,361. ఇదే రెండేళ్లకు అయితే 7.60శాతం వడ్డీరేటు చొప్పున 5లక్షలు జమ చేసినట్లయితే చేతికి రూ. 73,286 వడ్డీ అందుతుంది. మరోవైపు ఎస్బిఐ వీకేర్ డిపాజిట్ స్కీమ్ కింద 5ఏళ్ల నుంచి 10ఏళ్ల వ్యవధి డిపాజిట్లపై 7.50శాతం వడ్డీ రేటు ఆఫర్ చేస్తోంది. అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అమృత్ వృష్టి ప్రత్యేక పథకం మాత్రం 444 రోజుల డిపాజిట్ పై సీనియర్ సిటిజన్లకు ఏకంగా 7.75శాతం వడ్డీ రేటును ఆఫర్ చేస్తోంది. 400 రోజుల అమృత్ కలశ్ డిపాజిట్ పై 7.60శాతం వడ్డీరేటు అందిస్తోంది.